నేడు ఉత్తరాంధ్ర(Uttarandhra)లో తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) అధినేత చంద్రబాబు(Chandrababu) పర్యటించనున్నారు. ఉత్తరాంధ్రలో అత్యధిక స్థానాలను సాధించే దిశగా చంద్రబాబు ఇక్కడ తన సభలతో జనాలను పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తారు. విజయనగరం జిల్లాలోని గజపతి నగరం నియోజకవర్గం మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు.
ఇది చదవండి: డదవోలులో దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నికల ప్రచారం..
అనంతరం శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలోని పాతపట్నం, ఆముదాలవలసలో జరిగే ప్రజాగళం సభల్లో చంద్రబాబు పాల్గొని ప్రసంగించనున్నారు. ఆముదాలవలస నుండి శ్రీకాకుళం చేరుకొని 80 అడుగుల రహదారిలో గల జిల్లా టిడిపి కార్యాలయంలో రాత్రికి బస చేస్తారు. రేపు ఉదయం శ్రీకాకుళంలో ఎన్టీఆర్ స్కూల్ గ్రౌండ్ నందు మహిళలతో చంద్రబాబు నాయుడు సమావేశమవుతారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేత
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి