Sunday, May 31, 2026
News Navigation
Sunday, May 31, 2026
News Navigation

Breaking

Sunday, May 31, 2026
Home Political నిడదవోలులో దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నికల ప్రచారం..

నిడదవోలులో దగ్గుబాటి పురందేశ్వరి ఎన్నికల ప్రచారం..

by Rama
Purandeshwari

తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులో 2024సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిడదవోలు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా రాజమహేంద్రవరం పార్లమెంట్ జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీల ఉమ్మడి ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురందేశ్వరి (Purandeshwari) ఈరోజు విజ్జేశ్వరం గ్రామం నుండి ప్రచారాన్ని ప్రారంభించారు..ఆమెతోపాటు నిడదవోలు నియోజకవర్గ ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థి కందుల దుర్గేష్, నిడదవోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి బూరుగుపల్లి శేషారావులు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Follow us on : FacebookInstagramYouTube & Google News

విజ్జేశ్వరం నుండి మొదలైన ఈ రోడ్ షోకి విశేష స్పందన లభించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజ్జేశ్వరం, గోపవరం, పురుషోత్తపల్లి, సమిశ్రగూడెం డి. ముప్పవరం, కలవచర్ల, మునిపల్లి, పెండ్యాల గ్రామాలలో తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రచారంలో భాగంగా మహిళలు అడుగడుగునా మంగళ హారతులు పట్టారు. ఈ సందర్భంగా రాజమండ్రి పార్లమెంటరీ అభ్యర్థి దగ్గుపాటి పురందేశ్వరి మాట్లాడుతూ.. కమలం గుర్తుపై ఓటు వేసి తనను ఎంపీ అభ్యర్థిగా గెలిపించాలని అదే విధంగా గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి కందుల దుర్గేషను నిడదవోలు ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థించారు. ఉమ్మడి పార్టీల కలయికతోనే ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పురందేశ్వరి అన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి, భారతీయ జనతా పార్టీ, మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • విశాఖ కేంద్రంగా కొత్త రైల్వే జోన్.. జూన్ 1 నుంచి కార్యకలాపాలు..
    ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల నెరవేరనుంది. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటు కానున్న దేశంలోని 18వ రైల్వే జోన్ ‘దక్షిణ కోస్తా రైల్వే’ జూన్ 1 నుంచి అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్…
  • పాయకరావుపేటలో బ్లాస్టింగ్ల భయంతో ప్రజల ఆందోళన..
    అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలోని రాజీవ్‌నగర్, దుర్గాకాలనీ ప్రజల పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. పోలవరం ప్రాజెక్టు కాలువ పనుల కోసం జరుగుతున్న భారీ బాంబు బ్లాస్టింగ్లు స్థానికులకు నిద్రలేని రాత్రులను మిగులుస్తున్నాయి. ఒక్కసారిగా వినిపించే భారీ శబ్దాలతో చిన్నారులు భయంతో ఏడుస్తుండగా,…
  • తిరుపతి జిల్లా అన్నమేడు జడ్పీ స్కూల్‌ ప్రధానోపాధ్యాయుడి ఔదార్యం..
    పిల్లలకు తగిన ప్రోత్సాహం అందిస్తే వారు అద్భుతాలు చేసి చూపుతారన్న విషయాన్ని మరోసారి నిరూపించారు.. తిరుపతి జిల్లాకు చెందిన ఓ ప్రధానోపాధ్యాయుడు. పదో తరగతి పరీక్షల్లో అద్భుత ప్రతిభ చూపించిన వారిని విమానం ఎక్కిస్తానని నాయుడుపేట మండలం అన్నమేడు జడ్పీ హైస్కూల్‌…

CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి

Advertisements

You may also like

Our Visitor

018675
Total views : 89152

Copyright © 2024 CVR Telugu. All Rights Reserved.