సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ మీడియా సమావేశం….

Citizens for Democracy media conference

Advertisements

&NewLine;<p>రాష్ట్రంలో రాజకీయపార్టీల&comma; ప్రజాసంఘాల నాయకులపై కార్యకర్తలపై ఇటీవల పెడుతున్న పోలీసు కేసులలోని వాస్తవాల నిజనిర్ధారణ కోసం ఒక త్రిసభ్య సంఘాన్ని ఏర్పాటు చేస్తూ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ నిర్ణయం తీసుకున్నది&period; సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యవర్గ సమావేశం తిరుపతిలో శనివారం సంస్థ అధ్యక్షులు &comma; ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ జి&period; భవానీ ప్రసాద్ అధ్యక్షతన జరిగింది&period; ఇటీవల రాష్ట్రంలో ప్రతిపక్ష&comma; రాజకీయ పక్షాల&comma; ప్రజాసంఘాల కార్యకర్తలపై పోలీసులు ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమ కేసులు పెడుతున్న సంఘటనలపై సి&period;ఎఫ్&period;డి&period; ఆందోళన వ్యక్తం చేసింది&period; అలాగే<br>రాజకీయ భిన్నాభిప్రాయాలను&comma; రాజకీయ విమర్శలను సహించలేని ఒక అసహన వాతావరణం రాష్ట్రంలో పెరిగిపోవడంపై సి&period;ఎఫ్&period;డి&period; తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది&period; రాష్ట్రంలో పలు పట్టణాల్లో పోలీసు యాక్ట్ సెక్షన్ 30 నిబంధనలను నిరవధికంగా పొడిగించడం&comma; రాజకీయ పార్టీల ప్రజా సమీకరణలను అడ్డుకోవడం&comma; ఆందోళనల నేపథ్యంలో వివిధ పార్టీల&comma; సంఘాల నేతలను ముందస్తు గృహ నిర్బంధాలు చేయడం&comma; అక్రమంగా నిర్బంధించడం ఒక సర్వసాధారణ వ్యవహారంగా మారడం పై సి&period;ఎఫ్&period;డి&period; అభ్యంతరం వ్యక్తం చేసింది&period; పోలీసు వ్యవస్థను అధికార పార్టీ దుర్వినియోగం చేస్తోందని&comma; అందులో భాగంగానే వందలాది మంది ప్రతిపక్షాల కార్యకర్తలపై ఎలాంటి ఆధారాలు లేకుండా క్రిమినల్ కేసులు పెట్టడం ఒక ధోరణిగా తయారయ్యిందని కూడా సి&period;ఎఫ్&period;డి&period; అభిప్రాయపడింది&period; రాష్ట్రంలో చట్టబద్ధపాలన&comma; నిష్పాక్షిక స్వేచ్ఛాయుత &comma; పారదర్శక ఎన్నికలు జరగడానికి వీలుగా తమవంతు కృషి చేస్తున్నామని&comma; అందులో భాగంగానే పోలీసు అక్రమకేసుల విషయంపై తాము దృష్టి సారించామని సి&period;ఎఫ్&period;డి&period; కార్యవర్గం స్పష్టం చేసింది&period; గత కొద్ది నెలలుగా రాష్ట్రంలో ప్రతిపక్ష&comma; రాజకీయ పక్షాలు&comma; ప్రజాసంఘాల నాయకులు &comma; కార్యకర్తలపై పోలీసులు నమోదు చేసిన కేసుల స్వరూప స్వభావాలను పరిశీలించడానికి విభిన్న జీవనరంగాలలో సుప్రసిద్ధులైన పెద్దలతో ఒక త్రిసభ్య కమిటీ ని ఏర్పాటు చేస్తూ సి&period;ఎఫ్&period;డి&period; సమావేశం నిర్ణయం తీసుకున్నది&period; కమిటీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డిజిపి గా పనిచేసిన సీనియర్ ఐ&period;పి&period;ఎస్&period;అధికారి ఎం&period;వి&period; భాస్కరరావు&comma; ఆంధ్రప్రదేశ్ పూర్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ అనగాని సత్యప్రసాద్&comma; హిందూ దినపత్రిక విజయవాడ ఎడిషన్ పూర్వ రెసిడెంట్ ఎడిటర్ వెంకటేశ్వర్లు సభ్యులుగా ఉంటారు అని తెలిపింది&period; ఈ కమిటీ స్వయం నిర్ణయాధికారం కలిగి నిష్పాక్షికంగా పనిచేస్తుందని&comma; కమిటీసభ్యులు రాష్ట్రంలో పర్యటించి విభిన్న వర్గాలతో విస్తృతంగా సంప్రదింపులు జరుపుతారు అని&comma; కేసులలోని వాస్తవాలను తెలుసుకుంటారని సి&period;ఎఫ్&period;డి&period; తెలిపింది&period;<br>త్రిసభ్య కమిటీ ఆధ్వర్యంలో డిసెంబర్ 13 వ తేదీన విజయవాడలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని సి&period;ఎఫ్&period;డి&period; కార్యవర్గ సమావేశం నిర్ణయం తీసుకున్నది&period; సంబంధిత పక్షాలు&comma; బాధితులు పాల్గొని తమ అభిప్రాయాలను త్రిసభ్య కమిటీ కి తెలియపరచవచ్చునని సి&period;ఎఫ్&period;డి&period; ఆ ప్రకటనలో వెల్లడించింది&period; ఎన్నికలు త్వరలో రానున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు తమ కార్యకలాపాలను&comma; ప్రచారాలను స్వేచ్ఛగా నిర్వహించుకునే విధంగా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని సి&period;ఎఫ్&period;డి&period; విజ్ఞప్తి చేసింది&period; కార్యవర్గ సమావేశంలో సంస్థ ప్రధాన కార్యదర్శి రాష్ట్రఎన్నికల పూర్వప్రధానాధికారి డా&period;నిమ్మగడ్డ రమేష్ కుమార్&comma; సహాయకార్యదర్శి వి&period;లక్ష్మణరెడ్డి&comma; కోశాధికారి ఇ &period;ఫల్గుణ కుమార్ &comma; కార్యవర్గసభ్యులు పూర్వ చీఫ్ సెక్రటరీ ఎల్&period;వి&period; సుబ్రహ్మణ్యం &comma; పూర్వ డిజిపి ఎం&period;వి&period; కృష్ణారావు &comma; ప్రత్యక్షంగా పాల్గొనగా మిగిలిన సభ్యులు జూమ్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..