గిగ్ వర్కర్లతో సీఎం రేవంత్‌ రెడ్డి సమావేశం…

CM Revanth Reddy meeting with gig workers

Advertisements

&NewLine;<p>నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో గిగ్ వర్కర్స్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు&period; ప్రొఫెషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి సీఎం రేవంత్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు&period; ఎన్నికల ముందు గిగ్ అండ్ ప్లాట్ ఫార్మ్ వర్కర్లకు న్యాయం చేస్తానని రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు సమావేశం నిర్వహించారు&period; ఈ సమావేశానికి స్విగ్గి&comma; జొమాటో&comma; ఆటో డ్రైవర్లు&comma; గిగ్ ప్లాట్ ఫార్మ్ కిందకు వచ్చే ఓలా&comma; ఊబర్&comma; ర్యాపిడో&comma; పోర్టర్ తదితర కంపెనీలో పనిచేస్తున్న వర్కర్లు పాల్గొన్నారు&period; ఈ సందర్భంగా వారి సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారు&period; అయితే మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యాలు కల్పించటం వల్ల ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో గిగ్ వర్కర్లు సీఎం రేవంత్‌కు వివరించారు&period; రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 20 వేల గిగ్ వర్కర్లు ఉండగా తమకి ఉద్యోగ భద్రత కల్పించాలని సీఎంను కోరినట్టు సమాచారం&period; రాజస్థాన్ తరహా గిగ్ ప్లాట్ ఫార్మ్ కార్మికుల సంక్షేమ బిల్లు తేవాలని వర్కర్లు సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు&period; కాగా ఈ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎన్నికల హామీల్లో భాగంగా ఆరు గ్యారెంటీలను ప్రకటించారు&period; దీంతో తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రేవంత్ రెడ్డి మహాలక్ష్మి పథకాన్ని అమలులోకి తెచ్చారు&period; దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు&period; అయితే ఈ పథకం ద్వారా ఆటో డ్రైవర్లు&comma; ఉబర్&comma; ఓలా సిబ్బంది ఉపాధి కోల్పోయారు&period; దీంతో వారంత మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేయాలంటూ ఆందోళనలు చేపట్టి బస్ భవన్‌ ముట్టడికి యత్నించిన సంగతి తెలిసిందే&period; ఈక్రమంలో వారి పరిస్థితిని అర్థం చేసుకున్న సీఎం రేవంత్ రెడ్డి నేడు సమావేశమయ్యారు&period; ఈ నేపథ్యంలో వారి సమస్యలు విన్న సీఎం ఆటో&comma; ఊబర్&comma; ర్యాపిడో&comma; ఓలా వర్కర్ల కోసం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు&comma; ఎలాంటి భరోసా కల్పించనున్నారనేది ప్రాధాన్యతను సంతరించుకుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.