విసీ గారు.. ఇదేంది సారు

College captancy

Advertisements

&NewLine;<p>చదువులమ్మ తల్లి ఒడిలో వైసీపీ కరపత్రాలు పట్టుకుని విద్యార్థి విభాగం మీటింగ్ అంటూ చేసిన హడావిడి విద్యావేత్తలను ముక్కు మీద వేలు వేసుకొనిలా చేస్తోంది&period; కాకినాడ జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీలో ఈ భాగోతం జరిగింది&period; బుధవారం ఛాన్స్లర్ హోదాలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ వస్తున్నారు&period; ముందు రోజు రాత్రి గుట్టుచప్పుడు కాకుండా వైసీపీ సమావేశానికి అనుమతి ఇచ్చారు&period; ఓ రాజకీయ పార్టీ సమావేశానికి యూనివర్సిటీని ఎలా అనుమతిచ్చారంటూ మేధావులు ప్రశ్నిస్తున్నారు&period; ఇది తీవ్ర విమర్శలకు తావిస్తోంది&period; వైసీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జగనన్న కాలేజీ కెప్టెన్సి పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు&period; విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు&period; కాకినాడ జిల్లా అధ్యక్షుడు అనిల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు&period; విద్యార్థులు&comma; వారి తల్లిదండ్రులు మళ్ళీ జగన్ ను సీఎం చేయాలంటూ ఈ కార్యక్రమంలో పిలుపునివ్వడం&comma; జగన్ ఫోటోలతో ఉన్న టీ షర్ట్ లు విద్యార్థులు ధరించడం వివాదం అయింది&period; గవర్నర్ హాజరయ్యే కార్యక్రమానికి ముందు రోజు వైసీపీ జెండాలతో యూనివర్సిటీని నింపేయడం పట్ల విద్యావేత్తలు విమర్శిస్తున్నారు&period; విసీ అసమర్ధతకు ఇది నిదర్శనమని కాలేజ్ ప్రొఫెసర్లు కూడా అంగీకరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

జోగులాంబ గద్వాలలో అభివృద్ధికి దూరంగా కాలనీలు ..

యూఏఈ అధ్యక్షుడు అల్ నహ్యాన్‍తో మోదీ భేటీ …

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..