మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యాలపై కమిటీ ఏర్పాటు…

Seventh block collapsed in Medigadda barrage

Advertisements

&NewLine;<p>మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యాలపై అధ్యయనం చేసి పునరుద్ధరణ పనులు సిఫార్సు చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది&period; ఈ మేరకు కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్‌ ఏబీ పాండ్యా నేతృత్వంలో ఎనిమిది మందితో కమిటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపింది&period; కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీలో ఏడో బ్లాక్‌ అక్టోబరులో కుంగింది&period; ఈ బ్లాకులో పియర్స్‌ దెబ్బతినడంతోపాటు దిగువన కాంక్రీటు బ్లాకులు కొట్టుకుపోవడం&comma; గ్లేసియర్‌ దెబ్బతినడం తదితర సమస్యలు ఎదురయ్యాయి&period; నేషనల్‌ డ్యాం సేఫ్టీ అధికారులు పరిశీలించి పలు చర్యలు సిఫార్సు చేశారు&period; ఏబీ పాండ్యా ఛైర్మన్‌గా ఉన్నరాష్ట్ర డ్యాం సేఫ్టీ అథారిటీ కూడా బ్యారేజీని పరిశీలించింది&period; మరోవైపు విజిలెన్స్‌&comma; ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం దర్యాప్తును ముమ్మరం చేసింది&period; అయితే&comma; బ్యారేజీ కుంగడానికి గల కారణాలను తెలుసుకొని పునరుద్ధరించడం ప్రాధాన్య అంశంగా ఉన్న నేపథ్యంలో నిపుణుల కమిటీ ఏర్పాటుకు నీటిపారుదల శాఖ ప్రతిపాదించింది&period; ఏబీ పాండ్యా నేతృత్వంలో స్ట్రక్చరల్‌&comma; హైడ్రాలజీ నిపుణుడు&comma; మాజీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ రామరాజు&comma; ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌&lpar;జనరల్‌&rpar; మురళీధర్‌&comma; ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌&lpar;ఓఅండ్‌ఎం&rpar; నాగేందర్‌రావు తదితరులతో కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వ ఆమోదాన్ని కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి&period; ప్రభుత్వ ఆమోదం తర్వాత కమిటీ&period;&period; బ్యారేజీ కుంగడానికి గల కారణాలపై అధ్యయనం చేసి రెండు&comma; మూడు ప్రత్యామ్నాయాలతో నివేదిక తయారు చేయనుంది&period; తర్వాత కేంద్ర జలసంఘంతో చర్చించి తుది ఆమోదంతో పునరుద్ధరణ పనులు చేపట్టాల్సి ఉందని ఆయా వర్గాలు తెలిపాయి&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-video is-provider-youtube wp-block-embed-youtube wp-embed-aspect-16-9 wp-has-aspect-ratio"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<amp-youtube data-videoid&equals;"63BnLbH4xP4" layout&equals;"responsive" width&equals;"1170" height&equals;"658"><&sol;amp-youtube>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.