ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం – రేవంత్ రెడ్డి

Revanth Reddy

Advertisements

&NewLine;<p>దేశంలో మోదీ అనే ఔషధానికి గడువు తీరిపోయిందని తెలంగాణ ముఖ్యమంత్రి&comma; టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు&period; కాంగ్రెస్ పార్టీ 139à°µ ఆవిర్భావం సందర్భంగా నాగపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమన్నారు&period; రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కారణంగానే కర్ణాటకలో&comma; తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు&period; మహారాష్ట్రలోనూ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు&period; రాహుల్ గాంధీ త్వరలో భారత్ న్యాయ్ యాత్ర చేయనున్నారని తెలిపారు&period; బీజేపీ నిత్యం డబుల్ ఇంజిన్ సర్కార్ అంటోందని డబుల్ ఇంజిన్ అంటే అదానీ&comma; ప్రధాని అని ఎద్దేవా చేశారు&period; లోక్ సభలో రాహుల్ గాంధీ గొంతెత్తడంతో అదానీ ఇంజిన్ ఆగిపోయిందని ఇప్పుడు రాహుల్ భారత్ న్యాయ్ యాత్ర తర్వాత మోదీ ఇంజిన్ కూడా ఆగిపోతుందన్నారు&period; కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి దేశాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు&period; పార్టీ శ్రేణులంతా వంద రోజుల పాటు దేశం కోసం కాంగ్రెస్ కోసం పని చేయాలని విజ్ఞప్తి చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా నుంచి అమెరికాకు చేరుకున్న ట్రంప్‌..

ఇజ్రాయెల్, లెబనాల్ మధ్య సీజ్ఫైర్ పొడగింపు.

వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి లో వైద్యుల పర్యవేక్షణ లోపించింది.