193
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలును ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ప్రజాపాలన పేరిట ఈ హామీల అమలుకు చర్యలు చేపట్టింది. తాజాగా, ప్రజాపాలన హామీల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఈ సబ్ కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తారు. ఈ సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహరిస్తారు.