కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. కాసేపటి క్రితం హైకమాండ్ అధికారికంగా 57 మందితో జాబితా రిలీజ్ చేసింది. ఇందులో తెలంగాణలోని ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. పెద్దపల్లి నుంచి వంశీకృష్ణ, మల్కాజిగిరి – సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ – దానం నాగేందర్, చేవెళ్ల – రంజిత్ రెడ్డి, నాగర్ కర్నూలు – మల్లు రవిని ఖరారు చేశారు. ఇప్పటికే దాదాపు 10కి పైగా స్థానాలకు అభ్యర్థులను అధిష్టానం ప్రకటించింది. అనూహ్యంగా ఈ జాబితాలో ముగ్గురు ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన వారే ఉండటం ఆసక్తిగా మారింది. చేవెళ్ల టికెట్ రంజిత్ రెడ్డికి, మల్కాజిగిరి టికెట్ సునీతా మహేందర్ రెడ్డి, సికింద్రాబాద్ టికెట్ దానం నాగేందర్‌కు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్ మూడో జాబితా విడుదల…
85