66
హైదరాబాద్ లో అవుటర్ రింగ్ రోడ్డు చుట్టూ హెచ్ఎండీఏ లో ఉన్న ఖాళీ భూముల్లో టౌన్షిప్ లు నిర్మిస్తామని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. టౌన్ షిప్ లు నిర్మాణం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. మాస్టర్ ప్లాన్ లో రహదారుల విస్తరణ ఎంతవరకు ఉంటుందనేది మార్క్ చేయాలనీ, దీనిద్వారా ఇళ్లు నిర్మించిన తరువాత తొలిగించాల్సిన అవసరం ఉండదన్నారు. హెచ్ఎండీఏ పరిధిలో చెరువులకు సంబందించి ఒక్కో సందర్భంలో ఒక్కో సంఖ్య చెప్తున్నారని, వాటిని శాస్త్రబద్దంగా నమోదు చేయాలని అధికారులకు సూచించారు.