కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 10వ జిల్లా మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. ముందుగా పంచాయతీరాజ్ కార్యాలయం నుండి ప్రధాన కూడలి మీదుగా ర్యాలీ గా వచ్చి సోమప్ప సర్కిల్లో ఏర్పాటు చేసిన సభ ప్రాంగణం కు చేరుకున్నారు. ర్యాలీలో ప్రస్తుతం కరువుతో రైతులు పడే కష్టాలు ఎద్దుల బండి కాడమోసి రైతు ఆత్మహత్య చేసుకునే దృశ్యాన్ని ప్రదర్శించారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పై మండిపడ్డారు. రాష్ట్రంలో కరువు తాండవమాడుతుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడని విమర్శించారు.ఈ కరువు తో వలసలు వెళుతు, రైతులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్న కనీసం వారి కష్టాలు కూడా తెలుసుకోలేని దుర్మార్గ స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ఆయన మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు అంత కలిసి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడం ఖాయమని సిపిఐ నేత రామకృష్ణ తెలిపారు.
జగన్ సర్కార్ పై మండిపడ్డ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి..
66
previous post