కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 10వ జిల్లా మహాసభలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పాల్గొన్నారు. ముందుగా పంచాయతీరాజ్ కార్యాలయం నుండి ప్రధాన కూడలి మీదుగా ర్యాలీ గా వచ్చి సోమప్ప సర్కిల్లో ఏర్పాటు చేసిన సభ ప్రాంగణం కు చేరుకున్నారు. ర్యాలీలో ప్రస్తుతం కరువుతో రైతులు పడే కష్టాలు ఎద్దుల బండి కాడమోసి రైతు ఆత్మహత్య చేసుకునే దృశ్యాన్ని ప్రదర్శించారు. అనంతరం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పై మండిపడ్డారు. రాష్ట్రంలో కరువు తాండవమాడుతుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాడని విమర్శించారు.ఈ కరువు తో వలసలు వెళుతు, రైతులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్న కనీసం వారి కష్టాలు కూడా తెలుసుకోలేని దుర్మార్గ స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ఆయన మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు అంత కలిసి జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడం ఖాయమని సిపిఐ నేత రామకృష్ణ తెలిపారు.
Jagan Sarkar
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన కొత్త పథకం జగనన్న దోపిడీ గ్యారెంటీ స్కీమ్ అని అన్నారు. టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్. రాష్ట్ర ప్రజల భవిష్యత్‌కు ఒక గ్యారెంటీని అందించే నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే రాష్ట్ర సంపద దోపిడీకి గ్యారెంటీనిచ్చే పెత్తందారు జగన్ అని విమర్శించారు. జగనన్న దోపిడీ గ్యారెంటీ పథకంలో తనకు నచ్చిన కాంట్రాక్ట్ సంస్థలు, వ్యక్తులకు ప్రజల సొమ్ము దోచిపెట్టడానికి వీలుగా సీఎం గ్యారెంటీ లెటర్స్ ఇస్తున్నారన్నారు. మెగా ఇంజనీరింగ్ సంస్థకు జగన్ సర్కార్ ఇప్పటికే 255 కోట్ల రూపాయల చెల్లింపులకు సంబంధించి 7 గ్యారెంటీ లెటర్స్ మంజూరు చేసిందన్నారు. అయినవారికి దోచిపెట్టేందుకు రూల్స్‌కు విరుద్ధంగా గ్యారెంటీ లేఖలు ఇస్తున్న జగన్ సర్కార్. ప్రజాశ్రేయస్సుతో ముడిపడి ఉన్న అనేక పథకాలు. పనులకు మాత్రం వేలకోట్లు బకాయిపెట్టి, రాష్ట్రాభివృద్ధిని, సంక్షేమాన్ని గాలికొదిలేసిందని పట్టాభిరామ్ తీవ్రస్థాయిలో విమర్శించారు.





Total views : 80945