చిత్తూరు (Chittoor) పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడిగా తిరుచానూరు మాజీ సర్పంచ్ సీఆర్ రాజన్ (CR Rajan) ను నియమించారు. తిరుచానూరు ప్రాంతంలో ప్రాబల్యం కలిగిన రాజన్ వన్నియ కుల క్షత్రియ సంఘం రాష్ట్ర కోశాధికారిగా, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శిగా పని చేశారు. ఈ ఎన్నికల్లో చిత్తూరు అసెంబ్లీ టికెట్ ఆశించారు. దీనికోసం ఆయన చిత్తూరుకు మకాం మార్చి కొంతకాలం అక్కడే పార్టీలో చురుగ్గా పనిచేశారు. అయితే పలు సమీకరణల కారణంగా ఆయనకు టికెట్ దక్కలేదు. దానివల్ల ఆయనకు పార్టీలో సముచిత గుర్తింపు, గౌరవం కల్పించడంతో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో గణనీయంగా వున్న వన్నియ కుల క్షత్రియ సామాజికవర్గాన్ని సంతృప్తి పరిచేందుకు రాజన్కు కీలక పదవి కట్టబెట్టారు. ఆ సామాజికవర్గంలో ప్రాబల్యం కలిగిన రాజన్కు చిత్తూరు పార్లమెంటు అధ్యక్ష పదవి కేటాయించడం ప్రధాన్యత సంతరించుకుంది. చిత్తూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాలతో పాటు ఒక పార్లమెంటు స్థానాన్ని ఖచ్చితంగా గెలిచి తీరుతామని చిత్తూరు పార్లమెంటు అధ్యక్షుడు సిఆర్ రాజన్ పేర్కొన్నారు.
ఇది చదవండి: పండగవేళ అపశృతి..
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి