105
వసంత పంచమి వేడుకల వేళ బాసరలో కుక్కలు వణికించాయి. బాసరలో మంగళవారం అర్థరాత్రి పిచ్చికుక్కల స్వైర విహారం చేశాయి. ఏకంగా 15 మందిని కరవడంతో వారంతా ఆస్పత్రిలో చేరారు. స్థానికంగా ఉన్న ఓ లాడ్జి వద్ద కుక్కలు మొదట నలుగురిని కరిచాయి. తర్వాత మరో 11 మందిని కరిచాయి. వెంటనే వారిని ఆటోలో ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. వసంత పంచమి సందర్భంగా బాసరకు భక్తులు పొటేత్తుతున్న తరుణంలో ఈ ఘటనతో భక్తులు వణికిపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి కుక్కల బెడదను తీర్చాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు.
మరిన్నితాజావార్తలకోసంఇక్కడ క్లిక్ చేయండి.
Follow us on : Facebook, Instagram & YouTube.