ఐఫోన్ యూజర్లను టార్గెట్ చేస్తున్న కొత్త సైబర్ మోసం..

ఐఫోన్ యూజర్లను టార్గెట్ చేస్తున్న కొత్త సైబర్ మోసం

Advertisements

<p>ఐఫోన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని దేశవ్యాప్తంగా కొత్త తరహా సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది&period; ఇటీవల తమ ఫోన్‌లను పోగొట్టుకున్న లేదా దొంగతనానికి గురైన వారినే టార్గెట్ చేస్తూ సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులతో మోసాలకు పాల్పడుతున్నారు&period; ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కీలక హెచ్చరికలు జారీ చేసింది&period; యాపిల్ సపోర్ట్ పేరుతో నకిలీ SMSలు పంపి&comma; బాధితులను భయపెట్టి ఫేక్ లింక్‌లపై క్లిక్ చేయిస్తున్నారు&period; ఆ లింక్‌లు అచ్చం యాపిల్ లేదా ఐక్లౌడ్ అధికారిక పేజీల మాదిరిగానే కనిపిస్తాయి&period; వినియోగదారులు తమ ఆపిల్ ఇది &comma; పాస్‌వర్డ్&comma; ఓటీపీ నమోదు చేసిన వెంటనే అకౌంట్లు హ్యాకర్ల చేతికి వెళ్లిపోతున్నాయి&period; దీంతో &OpenCurlyDoubleQuote;ఫైండ్ మై ఐఫోన్ ” ఫీచర్ పనిచేయకుండా చేసి&comma; ఫోన్‌ను రీ సేల్ చేస్తున్నారు&period; ఈ తరహా సైబర్ నేరాలకు అసలైన రక్షణ అప్రమత్తతే అని అధికారులు అంటున్నారు &period; అనుమానాస్పద లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p>ఒక చిన్న SMS… ఒక నకిలీ లింక్… ఒక OTP… ఇవే ఇప్పుడు భారీ సైబర్ మోసాలకు ప్రధాన ఆయుధాలుగా మారాయి&period; ముఖ్యంగా ఐఫోన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న ఈ కొత్త హైబ్రిడ్ సైబర్ క్రైమ్ దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది&period; ముందుగా దొంగిలించిన లేదా పోగొట్టుకున్న ఫోన్‌à°² వివరాలు సేకరించి&comma; ఆ యజమానులకు &OpenCurlyDoubleQuote;మీ ఫోన్ ట్రేస్ అయింది” అంటూ సందేశాలు పంపుతున్నారు&period; అందులో ఇచ్చే లింక్‌పై క్లిక్ చేస్తే ఫేక్ ఐక్లౌడ్ లాగిన్ పేజీ ఓపెన్ అవుతుంది&period; బాధితులు తమ వివరాలు నమోదు చేస్తే హ్యాకర్లు అకౌంట్‌పై పూర్తి నియంత్రణ సాధిస్తున్నారు&period; అనంతరం యాక్టివేషన్ లాక్ తొలగించి ఫోన్‌ను మార్కెట్లో విక్రయిస్తున్నారు&period; ఈ మోసంతో వ్యక్తిగత ఫోటోలు&comma; బ్యాంకింగ్ సమాచారం&comma; ఈమెయిల్స్ కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు&period; అధికారిక ఐ క్లౌడ్ ఫైండ్ మై ఆఫీసియల్ పేజీ ద్వారానే ఫోన్‌ను ట్రాక్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>సైబర్ నేరగాళ్లు ఇప్పుడు టెక్నాలజీతో పాటు మనుషుల భావోద్వేగాలను కూడా ఆయుధంగా మార్చుకుంటున్నారు&period; &OpenCurlyDoubleQuote;మీ ఫోన్ దొరికింది”&comma; &OpenCurlyDoubleQuote;మీ డేటా డిలీట్ అవుతోంది” అంటూ వచ్చే సందేశాలు చూసి చాలామంది భయంతో వెంటనే స్పందిస్తున్నారు&period; ఇదే హ్యాకర్లకు కలిసొస్తున్న అవకాశం &period; కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ప్రకారం… యాపిల్ సపోర్ట్ పేరుతో వచ్చే నకిలీ మెసేజ్‌లు ఇప్పుడు ఎక్కువవుతున్నాయి&period; ముఖ్యంగా అంతర్జాతీయ నంబర్ల నుంచి వచ్చే SMSలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు&period; ఎటువంటి పరిస్థితుల్లోనూ OTPలను ఎవరికీ చెప్పకూడదని స్పష్టం చేస్తున్నారు&period; అలాగే టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పనిసరిగా ఆన్‌లో ఉంచాలని సూచిస్తున్నారు&period; ఫోన్ పోయిన వెంటనే సిఈఐఆర్ పోర్టల్ ద్వారా బ్లాక్ చేయించాలని చెబుతున్నారు&period; సైబర్ భద్రతలో చిన్న నిర్లక్ష్యం కూడా పెద్ద నష్టానికి దారితీసే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>&nbsp&semi;<&sol;p>&NewLine;<p>డిజిటల్ ప్రపంచంలో మొబైల్ ఫోన్ ఇప్పుడు ప్రతి వ్యక్తి జీవితంలో కీలక భాగంగా మారింది&period; అలాంటి సమయంలో ఫోన్ పోగొట్టుకోవడం అంటే కేవలం ఒక డివైజ్ కోల్పోవడం కాదు… వ్యక్తిగత సమాచారం మొత్తం ప్రమాదంలో పడినట్లే&period; ఇప్పుడు అదే పరిస్థితిని సైబర్ నేరగాళ్లు అవకాశంగా మార్చుకుంటున్నారు&period; ఐఫోన్ వినియోగదారులను టార్గెట్ చేస్తూ కొత్త తరహా హ్యాకింగ్ మోసాలు పెరుగుతున్నాయి&period; నకిలీ యాపిల్ వెబ్‌సైట్‌à°² ద్వారా ఆపిల్ ఐడీ వివరాలు సేకరించి&comma; బాధితుల అకౌంట్లను పూర్తిగా హ్యాక్ చేస్తున్నారు&period; దీంతో ఫోన్‌ను ట్రాక్ చేయడం అసాధ్యంగా మారుతోంది&period; ఈ నేపథ్యంలో అనుమానాస్పద లింక్‌లను ఎప్పుడూ ఓపెన్ చేయకూడదని అధికారులు చెబుతున్నారు &period; అధికారిక ఆపిల్ ఆఫీసియల్ వెబ్సైటు &comma; ఐక్లౌడ్ సేవలను మాత్రమే వినియోగించాలని సూచిస్తున్నారు&period; ఒకవేళ మోసానికి గురైతే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లో ఫిర్యాదు చేయాలని లేదా 1930 హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు&period;<br &sol;>&NewLine;మీ ఫోన్ భద్రత మీ చేతుల్లోనే ఉంది మరి జాగ్రత్త సుమీ &period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..