అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ తూహిన్ సిన్హా మీడియా సమేశం ఏర్పాటు చేసారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2023 సంవత్సరం లో గంజాయి సంబంధించి పోలీసు మరియు సబ్ కలిసి మొత్తం 266 కేసులు నమోదుచేసి అందులో 21785.29 కేజీలు గంజాయిని మరియు 16775 కేజీలు యాసిష్ ఆయిల్ని సీజ్ చేసి 859 నిందుతులను అరెస్ట్ చేశామని 248.94 ఎకరాలలో 11,68,100 ల గంజాయి మొక్కలను ధ్వంసం చేశామని అదే విధంగా 10290.5 ఎకరాల లో ప్రత్యామ్నాయ పంటలను రైతులకు కల్పించామని అయిన తెలిపారు. మావోయిస్టు లీడర్లని, 21 మిలిసియా సభ్యులను అరెస్ట్ చేయడం జరిగిందని 18 మంది మావోయిస్టు కోరిర్స్ మీద బైండ్ ఓవర్ కేసులను నమోదు చేశామని 7 మంది మావోయిస్టులు మరియు 3 మంది మిలిసియా సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారని, అలాగే 2 చోట్ల మావోయిస్టు యొక్క డంబు లని రికవరీ చేయడం జరిగిందని తెలియజేసారు. క్రైం రేటు 9 శాతం తగ్గినదని సారా, మరియు అక్రమ మద్యం దారుల పై 675 కేసులు నమోదు చేసి 738 మందిని అరెస్ట్ చేసి వారి నుంచి 11,422 లీటర్ల సారాయి సీజ్ చేసి 1,71,620 లీటర్ల పులుపు ను ధ్వంసం చేశామని మీడియా సమావేశంలో ఎస్పీ తూహిన్ సిన్హా తెలిపారు.
క్రైం రేటు 9 శాతం తగ్గింది – తూహిన్ సిన్హా
79
previous post