తుపాను ప్రభావం..భారీగా పంట నష్టం

district collector

Advertisements

&NewLine;<pre class&equals;"wp-block-code"><code> తుపాను ప్రభావంతో బాపట్ల జిల్లాలో వరి పంట అధికంగా నీట మునిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా తెలిపారు&period; <&sol;code><&sol;pre>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>తుపాను నష్టంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ముఖ్యమంత్రి బుధవారం వీక్షణ సమావేశం ద్వారా సమీక్షించారు&period; సహాయక చర్యలు తక్షణమే చేపట్టాలని బాపట్ల జిల్లా కలెక్టర్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశించారు&period; ముందుగా జిల్లాలో పరిస్థితిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<pre class&equals;"wp-block-code"><code> తుపాను ప్రభావం ఉన్నప్పటికీ జిల్లాలో భారీ నష్టం జరగకుండా సమగ్ర ప్రణాళికతో చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రికి జిల్లా కలెక్టర్ వివరించారు&period; 25 మండలాలలో వర్షం కురిసిందని&comma; 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయిందన్నారు&period; <&sol;code><&sol;pre>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు&period; కేవలం రెండోచోట్ల చిన్న ప్రమాదాలు జరిగాయని&comma; రెండు గోడలు కూలి నాలుగు గొర్రెలు చనిపోయాయన్నారు&period; 32 ఇళ్లు దెబ్బ తిన్నాయని&comma; 37 గ్రామాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందన్నారు&period; 350 స్తంభాలు పడిపోయాయని&comma; రాత్రి రెండున్నర గంటల వరకు విద్యుత్ శాఖ అధికారులు రోడ్లమీదనే ఉండి విద్యుత్ సరఫరా చేసినట్లు వివరించారు&period; ప్రస్తుతం 90 శాతంగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామన్నారు&period; పర్చూరు సబ్ స్టేషన్ దెబ్బతినడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని పనులు జరుగుతున్నాయన్నారు&period; అధికంగా సూర్యలంక&comma; ఓడరేవు ప్రాంతాలలో వారిని పునరావాస కేంద్రాలకు తరలించామన్నారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<pre class&equals;"wp-block-code"><code> జిల్లాలో 74 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని&comma; 1&comma;319 మందికి ఆశ్రయం కల్పించామని కలెక్టర్ రంజిత్ బాషా చెప్పారు&period; <&sol;code><&sol;pre>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>2&comma;500 మందికి భోజనాలు ఏర్పాట్లు చేస్తున్నామని&comma; బుధవారం సాయంత్రానికి వారిని ఇళ్లకు పంపుతామన్నారు&period; పునరావాస కేంద్రాల నుంచి వెళ్తున్న వారికి ప్రభుత్వం నిర్దేశించినట్లు ఐదు వస్తువులు పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసామన్నారు&period; 70 వేల హెక్టార్లలో ధాన్యం నీట మునిగిందని&comma; పొలాల్లో నీరు నిల్వ లేకుండా దిగువకు పంపే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు&period; ఇందుకోసం ఉపాధి హామీ పథకం కూలీల ద్వారా ఈ పనులు చేపట్టామన్నారు&period; ప్రతి మండలానికి ప్రోక్లైన్లు&comma; జెసిబి యంత్రాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించామని&comma; రూ&period; 25 లక్షలు నిధులు ఇచ్చామన్నారు&period; బాపట్లలో అధికంగా పండే ధాన్యం&comma; శనగ&comma; అరటి&comma; మిర్చి పంటలు దెబ్బతిన్నాయన్నారు&period; పంటల నష్టం అంచనాల సర్వే పనులు మొదలయ్యాయన్నారు&period; కారంచేడు&comma; మార్టూరు&comma; పర్చూరు మండలాలలో పంట కాలువల ద్వారా రహదారులకు అంతరాయం ఏర్పడగా వాటిని పునరుద్ధరించామన్నారు&period; తీర ప్రాంతంలో వలలు&comma; బోట్లు దెబ్బతిన్నాయన్నారు&period; ఇప్పటికే 93 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు&period; గేదెలకు అంటూ వ్యాధులు రాకుండా టీకాల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించామన్నారు&period;తుపాను నష్టంపై మూడు రోజుల్లో అంచనాల సర్వే పూర్తి చేసి నివేదిక పంపుతామన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ములుగు జిల్లాలో 100 రోజుల ఉపాధి హామీ పనులు..

ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రూప్‌పార్క్‌పై పోరాటానికి సిద్ధమవుతున్న స్థానికులు..

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..