యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర విషాదం..

Hanging

Advertisements

&NewLine;<p>యాదాద్రి భువనగిరి జిల్లా&colon; యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది&period; భువనగిరి పట్టణంలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఉంటున్న పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు తమ హాస్టల్ గదిలో ఆత్మహత్యకు పాల్పడ్డారు&period; ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు&period; విద్యార్థినుల హాస్టల్ గదిలో దొరికిన సూసైడ్ నోట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు&period;<br>హైదరాబాద్‌ హబ్సిగూడకు చెందిన బాలికలు సాయి కృప డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న ఎస్సీ హాస్టల్‌లో ఉంటూ భువనగిరిలోని పట్టణంలోని బాలికల పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు&period; అయితే శనివారం రోజున స్కూల్‌కు వెళ్లిన విద్యార్థినులు తిరిగి సాయంత్రం హాస్టల్‌కు వచ్చారు&period; అయితే శనివారం సాయంత్రం భవ్య&comma; వైష్ణవిలు మాత్రం ట్యూషన్‌కు వెళ్లలేదు&period; మిగిలిన విద్యార్థులు అడగగా&period;&period; తర్వాత వస్తామని చెప్పారు&period; అయితే వీరు ట్యూషన్‌కు రాకపోవడంతో ట్యూషన్ టీచర్&period;&period; వారిని తీసుకురావాలని ఇతర విద్యార్థినులను పంపించారు&period; అయితే వారు ఉన్న హాస్టల్ గది తలుపులు వేసి ఉండటంతో&period;&period; కిటికీలో నుంచి చూడగా&period;&period; వారు ఆత్మహత్య చేసుకుని కనిపించారు&period; దీంతో విద్యార్థినులు వెంటనే ట్యూషన్ టీచర్‌కు ఈ విషయం చెప్పారు&period; ఈ ఘటనతో ఉలిక్కపడ్డ హాస్టల్ సిబ్బంది&period;&period; బలవంతంగా తలుపులు తీసి విద్యార్థినులను ఆస్పత్రికి తరలించారు&period; అయితే అప్పటికే వారు మృతిచెందినట్టుగా వైద్యులు తెలిపారు&period; మృతదేహాలను పోస్టు మార్టమ్ నిమిత్తం మార్చురీకి తరలించారు&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టింది&period; ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థినుల గదిలో దొరికన సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు&period; ఇందులో తాము వెళ్లిపోతున్నందుకు అందరూ క్షమించాలని కోరారు&period; తాము చేయని తప్పుకు అందరూ మాటల అంటుంటే&period;&period; పడలేకపోతున్నామని పేర్కొన్నారు&period; తమను హాస్టల్ వార్డెన్ శైలజ మేడం తప్ప ఎవరూ నమ్మడం లేదని వాపోయారు&period; తమ బాధ ఎవరికి చెప్పుకోలేక వెళ్లిపోతున్నామని…&period; తమను ఒకే దగ్గర సమాధి చేయండి&period;&period; ఇదే తమ ఆఖరి కోరిక అని సూసైడ్ నోట్‌లో భవ్య&comma; వైష్ణవిలు పేర్కొన్నారు&period; ఈ ఘటనకు సంబంధించి పోలీసులు హాస్టల్‌ వార్డెన్‌ శైలజను&comma; ట్యూషన్‌ టీచర్‌ను ప్రశ్నిస్తున్నారు&period; అయితే హాస్టల్‌లో విద్యార్థినుల మధ్య గొడవ జరిగినట్టుగా తెలుస్తోంది&period; భవ్య&comma; వైష్ణవిలు తమను వేధింపులకు గురిచేస్తున్నారని అదే హాస్టల్‌లో ఉంటున్న జూనియర్ విద్యార్థినులు ఫిర్యాదు చేయడంతో&period;&period; హాస్టల్ సిబ్బంది వారిని మందలించినట్టుగా తెలుస్తోంది&period; అయితే ఈ ఘటనను వారు అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకుని ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి&period;&period;మరోవైపు మృతులు ఇద్దర్ని హత్య చేసి&period;&period;ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి&period; <a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;andhra-pradesh&sol;krishna&sol;the-role-of-krishna-role-of-arjuna&sol;amp&sol;">Read Also&period;&period;<&sol;a><&sol;p>&NewLine;

Advertisements

Related posts

భారత్‌కు అత్యాధునిక రక్షణ కవచం…చైనా, పాక్‌కు షాక్..

పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించిన రా కింగ్ మనోజ్ మంచు …

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్ ఈవెంట్ – జూన్ 12న మూవీ రిలీజ్ ..