బాంబు బెదిరింపులతో దేశ రాజధాని ఉలిక్కిపడింది. ఢిల్లీ(Delhi), నోయిడా ప్రాంతాల్లో పదుల సంఖ్యలో స్కూళ్లకు ఏకకాలంలో బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. దాదాపు 50కి పైగా పాఠశాలలకు ఈ-మెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. బెదిరింపుల నేపథ్యంలో విద్యార్థులను ఇంటికి పంపించారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు ఆయా స్కూళ్లకు చేరుకుని పిల్లలను తీసుకెళ్లారు. ఆపై పాఠశాలల్లో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది.
బాంబు బెదిరింపు కారణంగా ఢిల్లీలోని వివిధ పాఠశాలల్లో జరగాల్సిన పరీక్షలు నిలిచిపోయాయి. మరోవైపు బాంబ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మెయిల్ పంపిన అగంతకుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈమెయిల్ పంపడానికి ఉపయోగించిన ఐపీ అడ్రస్ సర్వర్ విదేశాల్లో ఉండొచ్చని దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. నోయిడా-ఘజియాబాద్-ఢిల్లీ పోలీసులు సమన్వయంతో దర్యాప్తును ముందుకు తీసుకెళ్తున్నారు. అదే ఐపీ అడ్రస్‌తో ఈమెయిల్ పంపినట్లు అనుమానిస్తున్నారు.
స్కూళ్లకు బాంబు బెదిరింపుల వెనుక ఒకే వ్యక్తి హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ వ్యక్తిని కనుక్కొనేందుకు పోలీసులు సెర్చింగ్ మొదలు పెట్టారు. ఉదయం నుంచి చాలా స్కూళ్లకు ఈమెయిల్స్ వచ్చాయని ఢిల్లీ డీసీపీ అపూర్వ గుప్తా చెప్పారు. స్కూళ్లను ఖాళీ చేసేశారని అన్నారు. మాకు తెలిసినంత వరకు ఈ మెయిల్స్‌లోని కంటెంట్ అంతా ఒకే మాదిరిగా ఉందని పేర్కొన్నారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- త్వరలో ఆపిల్ ఐఫోన్ 17 ఎయిర్ విడుదలఐఫోన్లకు ప్రపంచ వ్యాప్తంగా చాలా క్రేజ్ ఉంది. ఎన్నిరకాల ఫోన్లు విడుదలైనప్పటికీ ఐఫోన్ కు ఉండే క్రేజ్ అసలు తగ్గలేదు. వినియోగదారుల అవసరాలకు తగినట్టుగానే ఆపిల్ కంపెనీ నుంచి ఫోన్లు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆపిల్ కస్టమర్లకు ఇంకో…
- న్యూఢిల్లీ బరిలో కేజ్రీవాల్, కల్కాజీ నుంచి సీఎం అతిషీఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమ్ ఆద్మీ పార్టీ చివరిదైన నాలుగో జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో 38 మంది అభ్యర్థుల పేర్లను ఆప్ ప్రకటించింది. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి, కల్కాజీ స్థానం…
- బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీ కడుతున్నాంరాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. రాష్ట్ర అప్పులకు సంబంధించి తమ దగ్గర పక్కా లెక్కలు ఉన్నాయని తెలిపారు. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.