పుంగనూరు నియోజకవర్గంలోని బీసీవై పార్టీ నేత రామచంద్ర యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. సంక్రాంతి అనేది రైతులకు, యువతకు, మహిళలకు పండుగ, రైతులకు మంచి పంటలు పండాలని.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాలని కోరారు. రామ మందిర నిర్మాణం, విగ్రహా ప్రతిష్ట జరగడం శుభ పరిణామమని, రాబోయే రోజుల్లో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలన్నారు. ఏపీ లో రాక్షస పాలన అంతం కావాలని.. పుంగనూరు అభివృద్ధి పథంలో నడవాలంటే దుర్మార్గం అంతరించాలని రామచంద్ర తెలిపారు. దశాబ్ద కాలంలో పుంగనూరు నియోజక వర్గంలో అశాంతి ఏర్పడింది. ఒక కాలకేయుడు రావడంతో గ్రామ గ్రామంలో అంబోతులు తయారు చేశాడని విమర్శించారు. కొంతమంది పోలీసుల అండతో అణచివేతకు గురిచేస్తున్నారు.. పోలీసులకు, పోరంబోకులకు భయపడకండి.. పల్లెల్లో విధ్వంసం చేస్తే తరిమి కొట్టండి నేను అండగా ఉంటా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also..