90
నిత్యం క్షణం తీరిక లేకుండా జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలు ఒక్కసారిగా నెమ్మదించాయి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో ఈరోజు తెల్లవారుజాము నుంచే ఒక్కసారిగా దట్టమైన పొగమంచు అలుముకుంది. మేఘాలు నేలను ముద్దాడినట్టుగా పట్టణంలో ఎటు చూసినా శీతల ప్రదేశంతో కూడిన కాశ్మీర్ అందాలను తలపించింది. దీంతో ఈ ఏడాది ఎప్పుడు లేని విధంగా పొగ మంచు అలుముకోవడంతో పట్టణవాసులను కనువిందు చేసింది. మరోవైపు మార్నింగ్ వాకర్స్ క్రీడా మైదానంలో వాకింగ్ చేయడానికి వెళ్లి పొగ మంచు అందాలను వీక్షించారు. నిత్యం పరిమితిని మించిన వేగంతో వెళ్లే వాహనాలు పొగ మంచును చీల్చుకొని ముందుకు వెళ్తున్నాయి.