మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బిజెపి విజయ సంకల్ప యాత్ర నేడు జడ్చర్ల నియోజకవర్గానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాష్ట్ర బిజెపి కోశాధికారి శాంత కుమార్, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొదటగా బాలనగర్ మండల కేంద్రానికి విజయ సంకల్ప యాత్ర చేరుకున్న సందర్భంగా గిరిజన మహిళలు వారికి సాంప్రదాయా నృత్యాలతో స్వాగతం పలికారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఉద్దేశించి బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ దేశంలో మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని కాబోతున్నారని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి పార్టీకి 400 పైగా సీట్లు రావడం ఖాయమని మోదీని ఆపే శక్తి దేశంలో ఏ పార్టీకి లేదని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఇండియా కూటమే రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా అంగీకరించడం లేదని, రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలుపై పూర్తిగా విఫలం అయిందని వారన్నారు. భారతదేశం వికసించే భారత్ కావాలంటే దేశం మరింత అభివృద్ధి చెందేందుకు మరోసారి మోదీ ప్రధాని కావాల్సిందే అని ప్రజలంతా వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బిజెపికి తమ మద్దతును తెలిపి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం వచ్చేందుకు కృషి చేయాలని వారు ప్రజలకు పిలుపునిచ్చారు.
Mahbub Nagar
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయింది. ఈ మేరకు కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. అత్యవసర పనుల కారణంగా అమిత్ షా పర్యటన రద్దయిందని తెలిపారు. ఆదివారం మహబూబ్ నగర్, కరీంనగర్, హైదరాబాద్‌లలో నిర్వహించాల్సిన సమావేశాలు రద్దయ్యాయి. బీహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో అమిత్ షా పర్యటన రద్దయినట్లుగా వార్తలు వస్తున్నాయి. బీహార్‌లో నితీష్ కుమార్ I.N.D.I.A. కూటమికి గుడ్‌బై చెప్పి బీజేపీ వైపు అడుగులు వేస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దయింది.
నిత్యం క్షణం తీరిక లేకుండా జాతీయ రహదారిపై వెళ్తున్న వాహనాలు ఒక్కసారిగా నెమ్మదించాయి. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో ఈరోజు తెల్లవారుజాము నుంచే ఒక్కసారిగా దట్టమైన పొగమంచు అలుముకుంది. మేఘాలు నేలను ముద్దాడినట్టుగా పట్టణంలో ఎటు చూసినా శీతల ప్రదేశంతో కూడిన కాశ్మీర్ అందాలను తలపించింది. దీంతో ఈ ఏడాది ఎప్పుడు లేని విధంగా పొగ మంచు అలుముకోవడంతో పట్టణవాసులను కనువిందు చేసింది. మరోవైపు మార్నింగ్ వాకర్స్ క్రీడా మైదానంలో వాకింగ్ చేయడానికి వెళ్లి పొగ మంచు అందాలను వీక్షించారు. నిత్యం పరిమితిని మించిన వేగంతో వెళ్లే వాహనాలు పొగ మంచును చీల్చుకొని ముందుకు వెళ్తున్నాయి.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో అక్రమ మద్యాన్ని అధికారులు పట్టుకున్నారు. భూత్పూర్ నుంచి అక్రమంగా డీసీఎం వాహనంలో మద్యం కాటన్ లను తరలిస్తుండగా జీఎస్టీ అధికారులు వెంబడించి జడ్చర్ల పట్టణంలో వాహనాన్ని పట్టుకున్నారు. జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ అశోక్ కుమార్ జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.





Total views : 78020