సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బౌద్దనగర్ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ కంది శైలజతో కలిసి పద్మారావు గౌడ్ విస్తృతంగా పర్యటించారు. జామే ఉస్మానియా, ఈశ్వరీబాయి నగర్, ఎల్ నారాయణ నగర్, అంబర్ నగర్, బౌద్ధనగర్, సంజయ్ గాంధీ నగర్ తదితర ప్రాంతాల్లో పద్మారావు గౌడ్ పర్యటనకు
ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. కార్యకర్తలతో పాటు స్థానిక ప్రజలు కూడా ఆయనను అడుగడుగునా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా
పద్మారావు గౌడ్ మాట్లాడుతూ గతంలో తాము చేపట్టిన వివిధ శాశ్వత చర్యల వల్ల ప్రజలు భారీ వర్షాల వల్ల ఇబ్బంది పడే పరిస్థితులు తప్పాయని, సికింద్రాబాద్ పరిధిలో పలు ప్రధాన నాలా ల వెడల్పు, కల్వర్టుల పునర్నిర్మాణం వంటి పనులను చేపట్టామని తెలిపారు. సికింద్రాబాద్ పరిధిలో కరోనా నివారణ చర్యలను నిరంతరం తీసుకొని ప్రజలకు అండగా నిలిచామని తెలిపారు. నిరంతరం ప్రజల సమస్యలను తీర్చేందుకు సితాఫలమండీ లో తమ కార్యాలయం ఏర్పాటు చేసుకొని నిజాయితీగా ప్రజలకు సేవలను అందించే సిబ్బందిని ఈ కార్యాలయంలో నియమించుకున్నామని తెలిపారు. ప్రజలకు అందుబాటులో నిలిచిన తమకే ప్రజలను ఓటు అడిగే హక్కు ఉందని పద్మారావు గౌడ్ పేర్కొన్నారు.
డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పార్టీ ప్రచారం
71
previous post