తిరుపతి అభివృద్దే మా ఆశయం – టీటీడీ చైర్మెన్

Thirupathi Development

Advertisements

&NewLine;<p>తిరుపతి అభివృద్దే మా ఆశయంగా ముందుకు సాగుతామని&comma; ప్రజాభివృద్ది విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని టీటీడీ చైర్మెన్&comma; తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి స్పష్టం చేసారు&period; తిరుపతి నగరంలోని తిలక్ రోడ్డు నుండి జబ్బార్ లే అవుట్ జంక్షన్ మీదుగా నూతనంగ నిర్మించిన భూపిరాట్టి రహదారిని ఆదివారం టీటీడీ చైర్మెన్&comma; ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరవగా&comma; శ్రీశ్రీశ్రీ పెద్ద జీయంగార్&comma; శ్రీశ్రీశ్రీ చిన జీయంగార్ స్వాముల చేతుల మీదుగా&comma; తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష&comma; కమిషనర్ హరిత ఐఏఎస్&comma; డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్&comma; ముద్రనారాయణలు ప్రారంభించారు&period; ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన మాట్లాడుతూ శ్రీశ్రీశ్రీ రామానుజాచార్యుల వారి తల్లి గారైన భూపిరాట్టి పేరు మీదుగా ఈ నూతన రహదారికి పేరు పెట్టడం జరిగిందన్నారు&period; తిరుపతి అభివృద్దికై పాటుపడుతున్న తామపై ఎన్ని విమర్శలు చేసినా వెనుకడుగు వేయమని&comma; దేశంలోనే తిరుపతి ఖ్యాతిని మరింత విస్తరించేందుకు శ్రమిస్తునే వుంటామన్నారు&period; మేయర్ డాక్టర్ శిరీష&comma; కమిషనర్ హరిత ఐఏఎస్ ఇరువురు మాట్లాడుతూ 116 లక్షలతో తిలక్ రోడ్డు నుండి తాతయ్యగుంట గంగమ్మ గుడి వైపుగా జబ్బార్ లే అవుట్ జంక్షన్ వరకు నిర్మించిన భూపిరాట్టి నూతన రహదారిని ప్రారంభించడం జరిగిందన్నారు&period; తిరుపతి ప్రజల సౌకర్యార్ధం మరిన్ని అభివృద్ది పనులు త్వరలో చేపట్టడం&comma; ప్రారంభించడం జరుగుతుందన్నారు&period; డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతి ప్రజల అభివృద్దే ప్రధాన అజేండగా ముందుకు వెలుతున్నామని&comma; అభివృద్దిని అడ్డుకునే వారికి ప్రజలే బుద్ది చెబుతారని&comma; తమ కౌన్సిల్ మొత్తం నగరాభివృద్దికై నిరంతరం పాటుపడుతూనే వుంటుందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మత్స్యపురిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలు…

అల్లూరి జిల్లాలో రోడ్లు లేని గిరిజన గ్రామాలు…

జీటీ ఉత్కంఠభరిత విజయం – తేవాటియా శాంతమైన ముగింపు, గిల్-బట్లర్ ధాటికి ఆర్సీబీ పరాభవం..