ఆది దేవుని ఆలయాలకు పోటెత్తిన భక్తులు..

karthika pournami

Advertisements

&NewLine;<p>పవిత్ర కార్తీక మాసం అందున కార్తీక పౌర్ణమి సోమవారం కావడంతో కొత్తపేట నియోజకవర్గం లోని శివాలయాలు భక్తులతో కిక్కిరిసాయి&period; తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు కాలువలో పుణ్య స్నానాలు ఆచరించారు&period; రేవు ఆవరణలో మహిళలు అరటి డొప్పలలో ఆవు నెయ్యితో దీపాలు వెలిగించి పూజలు చేసి కాలువలో వదిలారు&period; మరో ప్రక్క ఓంకార నాదంతో శివాలయాలు మార్మోగాయి&period; తెల్లవారుజామున నుంచే భక్తులు సమీపంలో గల శైవ క్షేతాలకు వెళ్లి స్వామి వారికి ప్రత్యేక పూజలు&comma; అభిషేకాలు నిర్వహించారు&period; ముఖ్యంగా ప్రసిద్ధిగాంచిన స్వయంభూ క్షేత్రమైన కొత్తపేట మండల పరిధిలోని పలివెల శ్రీ ఉమాకొప్పెశ్వరస్వామి దేవాలయం నందు తెల్లవారుజామునుండే స్వామి దర్శనం కొరకు శివాలయం నందు బారులు తీరారు&period;అత్యధిక సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది&period;ఓ ప్రక్క భక్తులు ప్రదక్షిణలు చేస్తూ హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివ నామస్మరణతో మార్మోగించారు&period;కార్తీక దీపాలతో మహిళల సందడి ఎక్కువైంది&period;స్వామి వారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు&period; భక్తులు అధిక సంఖ్యలో అభిషేకాలు నిర్వహించుకున్నారు&period; ఎక్కువ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో 20 రూపాయలు ప్రత్యేక దర్శనం తో పాటు ఉచిత దర్శనం దేవస్థానం వారు ఏర్పాటు చేశారు&period; ప్రత్యేక క్యూలైన్లు ద్వారా స్వామి వారిని దర్శించుకున్నారు&period; ఆలయ కమిటీ చైర్మన్ భమిడిపాటి దుర్గా లక్ష్మినారాయణ&comma; దేవస్థాన సిబ్బంది ఆధ్వర్యంలో భక్తులకు ఏవిధమైన అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.