వంద రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు..

ponnam prabhakar

Advertisements

&NewLine;<p>కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితులపై అక్రమంగా పెట్టిన కేసులను ఎత్తివేస్తామని హుస్నాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ తెలిపారు&period; సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ స్వయంభూ రాజరాజేశ్వర స్వామి వారిని పొన్నం ప్రభాకర్ దర్శించుకోని ప్రత్యేక పూజలు నిర్వహించారు&period; అనంతరం ఆరు గ్యారెంటీల అమలుపై సంతకం చేసి&comma; అఫిడవిట్ తో పాటు నియోజకవర్గ అభివృద్ధిపై మేనిఫెస్టోను పొన్నం ప్రభాకర్ విడుదల చేశారు&period; ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హుస్నాబాద్ కు మెడికల్ కళాశాల రాబోతోందని&comma; హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు ప్రాంతాలను పర్యటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామన్నారు&period; అర్హులైన లబ్ధిదారులందరికీ ఇండ్లు ఇస్తామని&comma; కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామన్నారు&period; కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందిస్తామన్నారు&period; హుస్నాబాద్ ప్రాంతంలోని కాలువల నిర్మాణం పూర్తి చేసి సాగునీరు అందిస్తామని&comma; వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను స్థాపిస్తామన్నారు&period; రాష్ట్రంతో పాటు హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మాజీ సీఎం జగన్‍కు మంత్రి నారా లోకేష్ సవాల్.

చరిత్ర సృష్టించిన రామ్ చరణ్ ‘పెద్ది’.. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా వసూళ్లు.

ఆదిలాబాద్ పట్టణ అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్..