90
శ్రీశైలం శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి అమ్మవార్లకు కృష్ణాజిల్లా అవనిగడ్డకు చెందిన వల్లభనేని రామారావు కృష్ణకుమారి దంపతులు స్వామి అమ్మవార్లకు వెండి వస్తువులను బహుకరించి మొక్కలు తీర్చుకున్నారు. 740 గ్రాముల వెండి బిందె, 390 గ్రాముల వెండి ప్రమిదలు, 2, 150 గ్రాముల వెండి ప్లేటు 1, 160 గ్రాముల వెండి అక్షింతల గిన్నెలు, 2,350 గ్రాముల అగరుబత్తి స్టాండ్ దేవస్థానం ఏఈఓ స్వాములుకు అమ్మవారి ఆలయంలో అందజేసినట్టు ఈఓ పెద్దిరాజు తెలిపారు. అమ్మవారి ఆలయ ప్రాంగణములోని ఆశీర్వచన మండపంలో వల్లభనేని రామారావు దంపతులకు ఆలయ అధికారులు స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలతో సత్కరించగా అర్చకులు వేదపండితులు స్వామివారి లడ్డు ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనలు చేశారు.