జాతరలో కూల్‌డ్రింక్ తాగి 70 మందికి అస్వస్థత..

జాతరలో కూల్‌డ్రింక్ తాగి 70 మందికి అస్వస్థత

Advertisements

<p>చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని బైరెడ్డిపల్లి మండలంలో దాదాపు 70 మంది అస్వస్థతకు గురయ్యారు&period; బైరెడ్డిపల్లి మండలం పాతపేటలో గంగమ్మ జాతర సందర్భంగా జరిగింది ఈ ఘటన&period; గంగమ్మ జాతరలో భక్తులకు పంపిణీ చేసిన కూల్‌డ్రింక్ తాగిన అనంతరం దాదాపు 70 మంది అస్వస్థతకు గురయ్యారు&period; చిన్నారులు&comma; గర్భిణీలు సహా పలువురు అనారోగ్యానికి గురికావడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది&period; అయితే వైద్యుల సకాల చర్యలతో బాధితులంతా కోలుకోవడంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు&period; జాతరలో పాల్గొన్న భక్తులకు పంపిణీ చేసేందుకు స్థానిక మహిళ తమిళనాడు నుంచి తీసుకొచ్చిన ఆరెంజ్ కలర్ లిక్విడ్‌తో జ్యూస్ తయారు చేసింది&period; ఆలయం వద్దకు వచ్చిన భక్తులకు ఆ జ్యూస్ పంపిణీ చేయగా&comma; తాగిన కొద్దిసేపటికే చిన్నారులు&comma; పెద్దలు&comma; గర్భిణీలు సహా సుమారు 70 మంది అస్వస్థతకు గురయ్యారు&period; ఒక్కసారిగా పలువురు అనారోగ్యానికి గురికావడంతో గ్రామంలో కలకలం రేగింది&period; సమాచారం అందుకున్న వెంటనే బైరెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి విజయ్ చందర్ తన వైద్య బృందంతో ఘటనాస్థలికి చేరుకుని బాధితులకు చికిత్స అందించారు&period; ఐతే జ్యూస్ వల్లే అస్వస్థతకు గురయ్యారా&quest; లేదంటే ఇతర కారణాలేమైనా ఉన్నాయా&quest; అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మం. మల్గి గ్రామ సరిహద్దులో బీదర్ చెత్త.

భూముల మార్కెట్ విలువల సవరణకు TG ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.

ఇవాళ పాలమూరు పర్యటనకు సీఎం రేవంత్‌రెడ్డి.