66
అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో మోటర్ వెహికల్ కార్యాలయం వద్ద ధర్నాకు కూర్చున్నారు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి. గత సంవత్సరం నుండి నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న వెహికిల్స్ పై చర్యలు తీసుకోవాలని అధికారులకు అర్జీలు అందజేశామన్నారు. ఇప్పటివరకు ఎవ్వరు వాటిని పట్టించుకోలేదని పేర్కొన్నారు. అధికార పార్టీకి చెందిన వాహనాలుగా గుర్తించి.. వారి పేర్లు తెలిపినా.. ఎటువంటి స్పందన లేదని తెలిపారు టీజేటీఎం నాయకుడు సోమశేఖర్ నాయుడు. గతంలో చాలా సార్లు తమపై అలాంటి వాహనాల్లోనే వచ్చి దాడి చేశారని పేర్కొన్నారు.