75
గుంటూరు జిల్లాలో కుక్కలు రెచ్చిపోతున్నాయి. పట్టణంలోని సంపత్ నగర్ లో రోడ్ పక్క నుంచి నడిచి వెళుతున్న ఆరు సంవత్సరాల లావణ్య శ్రీ అనే పాప పై కుక్కలు దాడి చేశాయి. సకాలంలో స్థానికులు స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కుక్కల ధాటికి కింద పడిపోయిన బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే లావణ్యశ్రీని ఆసుపత్రికి తరలించారు. గత వారం రోజుల కిందట కూడా ఇదే తరహాలో కుక్కలు దాడి చేశాయని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు కుక్కల బారి నుండి ప్రజలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Read Also..
Read Also..