గ్రేటర్ వరంగల్ మునిసిపల్ పరిధిలో చిన్నారులపై విధి కుక్కల దాడి. 21 వ డివిజన్ ఎల్బీనగర్ లో ఘటన. ఇద్దరు చిన్నారుల పై కుక్కల దాడి. సైకిల్ పై వెళ్తున్న ఇద్దరు చిన్నారులపై కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలు. హాస్పటల్ కి తరలించిన స్థానికులు. గాయపడ్డ వారిలో ఒక బాబు పరిస్థితి విషమం. రోజురోజుకు కుక్కల దాడులు పెరుగుతున్న కూడా చలనం లేనట్లుగా వ్యవహరిస్తున్న మున్సిపల్ అధికారులు.
dog attack
గుంటూరు జిల్లాలో కుక్కలు రెచ్చిపోతున్నాయి. పట్టణంలోని సంపత్ నగర్ లో రోడ్ పక్క నుంచి నడిచి వెళుతున్న ఆరు సంవత్సరాల లావణ్య శ్రీ అనే పాప పై కుక్కలు దాడి చేశాయి. సకాలంలో స్థానికులు స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కుక్కల ధాటికి కింద పడిపోయిన బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే లావణ్యశ్రీని ఆసుపత్రికి తరలించారు. గత వారం రోజుల కిందట కూడా ఇదే తరహాలో కుక్కలు దాడి చేశాయని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు కుక్కల బారి నుండి ప్రజలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Read Also..
Read Also..
శ్రీ సత్య సాయి జిల్లా, ముగ్గురి పై పిచ్చి కుక్క దాడి. గోరంట్ల మండలం కనగానపల్లి లో ముగ్గురి పై పిచ్చి కుక్క దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డ సంఘటన చోటు చేసుకుంది. మండలంలోని కాగానపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం రెండేళ్ల ధనుష్ అనే బాలుడి పై పిచ్చి కుక్క కరుస్తుండగా అడ్డు వెళ్లినటువంటి అవ్వ బురగ గంగులమ్మ తో పాటు మనుమరాలు గౌతమి ( 11) పై కూడా దాడి చేయడంతో గంగులమ్మ తలకు తీవ్ర గాయాలయ్యాయి, దీంతో వెంటనే చుట్టు ప్రక్కల వారు పిచ్చి కుక్క ను తరిమివేసి, వెంటనే గాయపడిన వారిని గోరంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్ వినోద్ కుమార్ ప్రథమ చికిత్సలు అనంతరం మెరుగైన వైద్యం కోసం హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బోరబండ లోని సుల్తాన్ నగర్ లో మూడో తరగతి చదువుతున్న బాలుడి పై కుక్క దాడి తన స్నేహితులతో కలిసి ఆడుతుండగా పక్కన ఇంటి నుంచి వచ్చిన కుక్క ఒకేసారి పిల్లలపై కి రావడంతో పరుగులు తీసిన పిల్లలు హుటాహుటిన ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి బాలుడిని తరలించారు కుక్క ఇంటి యజమానిపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన బోరబండ పోలీసులు.





Total views : 181087