సత్యసాయి నిగమాగమంలో వీవ్స్ అండ్ క్రాప్ట్స్ హ్యాండ్ లూమ్ వస్త్ర ప్రదర్శన ఆరంభం. హైదరాబాద్ , డిసెంబర్ 2023, శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్య సాయి నిగమాగమంలో ఏర్పాటైన కృతి వీవ్స్ అండ్ క్రాప్ట్స్ హ్యాండ్ లూమ్ వస్త్ర ప్రదర్శన నగర సోషలైట్ డాక్టర్ గూడపాటి విజయలక్ష్మీ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె ఇక్కడి హాలులో కొలువుదీరిన చేనేత కారులు వస్త్రోత్పత్తులు తిలకిస్తూ, చేనేత కారులతో వాటి తయారీ విధానం, ప్రత్యేకత తెలుసుకుంటూ కలవడిగా తిరిగారు. భారతీయ సంస్కృతి లో సిల్క్, హ్యాండ్ లూమ్ వస్త్రో ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని డాక్టర్ గూడపాటి విజయలక్ష్మీ అన్నారు. ఈ ఉత్పత్తులకు నేటికి వన్నె తగ్గలెదన్నారు. నేటి తరం యువతలో కూడా హ్యాండ్ లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారన్నారు. చేనేత అమ్మ చల్లని ఒడిలా ఆమె వర్ణించారు. అయితే హ్యాండ్ లుమ్ ఉత్పత్తుల తయారీకి చేనేత కారులు శ్రమ వెల కట్టలేనిదన్నారు. ప్రతి ఒక్కరూ చేనేత ను ఆదరించాలని, అప్పుడే చేనేత కారుల కష్టానికి తగ్గా ఫలితం పరోక్షంగా ఇవ్వగలమన్నారు. నిర్వాహకులు యలమంచిలి శ్రీలత మాట్లాడుతూ, ఈ నెల 25 వ తేది వరకు కొనసాగుతున్న ప్రదర్శన లో దేశం లోని 14 రాష్ట్రాల నుండి చేనేత కారులు , చేతి పని బృందాలు తమ సిల్క్ హ్యాండ్ లూమ్ చీరలు, డ్రెస్ మెటిరియల్ వంటి 75 వేల రకాల వస్త్రో ఉత్పత్తులను అందుబాటులొ ఉంచారని వివరించారు. ఈ నెల 27వ తేదీ నుండి నిజాంపేటలో కూడా ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అమ్మ చల్లని ఒడిలా చేనేత : డాక్టర్ గూడపాటి విజయలక్ష్మి
64
previous post