77
శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు హైదరాబాద్ రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా భూదాన్ పోచంపల్లి వెళ్లనున్నారు. చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అదేవిధంగా పద్మశ్రీ, సంత్ కబీర్, ఇతర జాతీయ పురస్కార గ్రహీతలతో మాట్లాడి పోచంపల్లి చేనత పరిస్థితులపై చర్చించనున్నారు. ఇక ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అవార్డులు వచ్చిన 16 మందిని గుర్తించి వారి జాబితాను ఢిల్లీకి పంపించారు. వారిలో ఎంపిక చేసిన ఐదు నుంచి 10 మందితో రాష్ట్రపతి ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. శ్రీరంజన్ హ్యాండ్లూమ్ యూనిట్లను సైతం సందర్శించి మగ్గాలు, మగ్గం నేసే ప్రక్రియ పరిశీలించనున్నారు.