జగన్ హయాంలో నెరవేరిన సొంత ఇంటి కల..

house

Advertisements

&NewLine;<p>కడప జిల్లా… ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడమే గాక&comma; ఇల్లు కట్టించి ఇచ్చే కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చెప్పారు&period; ఒక్క వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలోను&comma; మళ్లీ వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తప్ప మరే ప్రభుత్వంలోనూ నిరుపేదలకు ఈ నియోజకవర్గంలో ఇల్లు మంజూరు కాలేదన్న విషయాన్ని ఎమ్మెల్యే సందర్భంగా గుర్తు చేశారు&period; తెలుగుదేశం నేతలు కేవలం విమర్శలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు తప్ప&comma; టిడిపి ప్రభుత్వం ఏ నిరుపేదకు ఏ ఇల్లు ఎక్కడ ఇచ్చిందో చెప్పాలని ఎమ్మెల్యే రాచమల్లు డిమాండ్ చేశారు&period; ప్రజా నేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా సోములవారి పల్లి జగనన్న కాలనీలో నూతన ఇళ్లను ఎమ్మెల్యే రాచమల్లు ప్రారంభించారు&period; నిరుపేదల సొంత ఇంటి కల నెరవేర్చిన ముఖ్యమంత్రికి నియోజక వర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు చెప్పారు&period; ఇళ్ళ నిర్మాణం విషయంలో కొంత ఆలస్యమైనా అర్హులకు సిఎం పుట్టిన రోజున వెయ్యి ఇళ్లు పూర్తి చేసి అందిస్తున్నామన్నారు&period; మీనపురం&comma; బొల్లారం జగనన్న కాలనీలలో కూడా రాబోయే మూడు నాలుగు నెలల్లో 17 వేల ఇళ్లు పూర్తి చేసి ఇస్తామన్నారు&period; అయితే నియోజక వర్గంలో 24 వేల ఇళ్లు ఇవ్వటమే కాక వాటిని నిర్మించి ఇచ్చే బాధ్యతను తీసుకున్నామన్నారు&period; సోములవారి పల్లెలోని రామేశ్వరం జగనన్న కాలనీ ఇళ్ళ ప్రారంభోత్సవంలో మున్సిపల్ చైర్ పర్సన్ వీనుపల్లి లక్ష్మీదేవి&comma; ఆప్కాబ్ చైర్మన్ మల్లెల ఝాన్సీ రాణి&comma; పద్మ చెలియా&comma; కార్పొరేషన్ చైర్మన్ జింక విజయలక్ష్మి&comma; వైసిపి నాయకులు నరసింహారెడ్డి&comma; కల్లూరు నాగేంద్ర రెడ్డి&comma; వరుకూటి ఓబుల్ రెడ్డి&comma; పిట్ట బాలాజీ పాతకోట వంశీధర్ రెడ్డి&comma; ఎంపీపీ శేఖర్ యాదవ్ ఇతర నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు&period;&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్