ప్రకాశం జిల్లా(Prakasam District) యర్రగొండపాలెంలోని టీడీపీ కార్యాలయం(TDP office) వద్ద డ్రోన్(Drone) కలకలం సృష్టించింది. నవీన్ అనే యువకుడు వైసీపీ బ్యాండెడ్ చేతికి పెట్టుకుని మినీ డ్రోన్ కెమెరా ఎగరవేస్తూ హల్ చల్ చేసాడు. ఆ డ్రోన్ తో టీడీపీ కార్యాలయాన్ని షూట్ చేసి, ఆ తరువాత కార్యాలయం లోపలకు పంపే క్రమంలో డ్రోన్ కింద పడిపోయింది.
అప్రమత్తమయిన టీడీపీ నాయకులు నవీన్ ను పట్టుకుని పోలీస్ లకు అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు తన ప్రచారాన్ని ముగించుకుని యర్రగొండపాలెం లోని పార్టీ కార్యాలయానికి వచ్చి నాయకులతో మాట్లాడి..అనుచరులతో కలసి శనివారం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ కు వెళ్ళారు.
ఈ సందర్భంగా సిఐ రాములు నాయక్ తో మాట్లాడుతూ వైసీపీ కి చెందిన వారు ఉద్దేశ పూర్వకంగానే డ్రోన్ కెమెరా ను టిడిపి కార్యాలయం లోకి పంపే ప్రయత్నం చేశారని విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ క్రమంలో టీడీపీ నాయకులు తమ నాయకుడు ఎరిక్షన్ బాబు కు హాని చేయాలనే ఉద్దేశంతో నే వైసీపీ కి చెందిన వారు పుల్లలచెరువు మండలం నాయుడుపాలెం కు చెందిన నవీన్ తో రెక్కీ నిర్వహించారని ఆరోపించారు. దీని వెనుక ఉన్న అసలైన సూత్ర దారులను గుర్తించాలని సిఐ కు తెలిపారు.
డ్రోన్ ఎగుర వేసిన నవీన్ పై పోలీస్ లు కేసు నమోదు చేసారు. అర్ధరాత్రి ఎరిక్షన్ బాబు అనుచరులతో పోలీస్ స్టేషన్ కు వెళ్ళటంతో రాజకీయ వేడిని రాజేసినట్లయింది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- పసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపంపసిఫిక్ ద్వీప దేశం వనౌటులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.3 గా నమోదైంది. దేశంలో అతిపెద్ద నగరమైన పోర్ట్ విలాకు పశ్చిమాన 57 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.…
- తెలంగాణ అసెంబ్లీని కుదిపేసిన లగచర్ల ఘటన..తెలంగాణ శాసనసభ సమావేశాలు విపక్షాల నిరసనల మధ్య కొనసాగుతున్నాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనపై అసెంబ్లీలో చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. వాయిదా తీర్మానాల కోసం బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేశాయి. అయితే బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్యే…
- శీతాకాలపు విడిదికి హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి…శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్‌కు వచ్చారు. హకీంపేట్ విమానాశ్రయంలో ఆమెకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా భారీ కాన్వాయ్‌తో సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లారు. తొలుత ఏపీలో…
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.