• నాటకీయ పరిణామాల మధ్య ఎంవివి కార్యాలయంలో 6 గంటల పాటు సోదాలు
• సోదాలలో పాల్గొన్న 4 ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు
• వందల కొద్ది చీరలు వేలకొద్దీ కూపన్లు, డిజిటల్ వాచ్ లు, గాజులు, నగదు గుర్తింపు
విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం లో వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఎంవివి సత్యనారాయణ (MVV Satyanarayana) 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లను కొనుగోలు చేసేందుకు ఓటర్లకు తాయిలాలు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో నిఘా పెట్టిన ఎలక్షన్ కమిషన్ ఫ్లయింగ్ స్క్యడ్ బృందాలు ఒకేసారి ఎంవివి సత్యనారాయణ కార్యాలయం, ఇళ్లపై దాడులు నిర్వహించి ఆరు గంటలకు పైగా సోదాలు నిర్వహించారు. సంఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే ఈ నెల 13న జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుండి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా ఏంఎల్ఏ అభ్యర్ధిగా ఎంవివి సత్యనారాయణ పోటీ చేస్తున్నారు. ఇదే క్రమంలో తన నియోజకవర్గం పరిధిలోని నాలుగు వార్డులలో కూపన్లను, డిజిటల్ వాచ్ లు, గాజులు, నగదు పంచేందుకు సిద్ధం చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అనుకున్న కార్యచరణ ప్రకారం శుక్రవారం రాత్రి 9 గంటల తర్వాత వీటిని పంచేందుకు తమ కార్యకర్తలను కార్యాలయానికి పిలిచి వారికి ఆయా ప్రాంతాల యొక్క ఓటర్ లిస్ట్ లను పంచి ఈ కుపన్డిజిటల్ వాచ్ లు, గాజులు, నగదు లను ఎలా జారీ చేయాలి, ఏ వస్తువు ఎవరికి జారీ చేయాలి అన్న అంశాలపై శిక్షణ ఇస్తుండగా ఒక్కసారిగా రెండు ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఆఫీసులో దాడులు ప్రారంభించాయి. ఇదిలా ఉండగా మరొక బృందం ఎంవివి 18 వ వార్డులో నిర్వహిస్తున్న సిద్ధం సభ వద్దకు వెళ్లి ఎంవివి సత్యనారాయణ ను రాత్రి 9:30 సమయంలో ఆఫీసుకు తీసుకువచ్చారు. ఆ తదనంతరం మరొక ఫ్లయింగ్ ఫ్లయింగ్ స్క్వాడ్ 9:45 గంటలకు ఆఫీసుకు చేరుకుని రాత్రి రెండు గంటల వరకు సోదాలు నిర్వహించాయి ఈ సోదాలలో భారీగా చీరల తో పాటు , పంచడానికి సిద్ధంగా ఉంచిన కుపన్ లు డిజిటల్ వాచ్ లు, గాజులు, నగదు గుర్తించడం జరిగిందని సమాచారం.
ఇదిలా ఉండగా 13వ తారీకు ఎన్నికలకు ముందుగానే ప్రతి ఇంటికి ఆ ప్రాంత పరిస్థితులు బట్టి అపార్ట్మెంట్ ఓటర్లకు ఒకరంగు, స్లమ్ ఏరియా ఓటర్లకు ఒకరంగు, మధ్యతరగతి వాళ్ళకి ఒక రంగు చొప్పున మూడు రంగులలో ఈ కుపన్లను సిద్ధం చేయడం జరిగిందని వీటిలో 3000, 4000, 5000 చొప్పున మూడు విభాగాలుగా పంచేందుకు ఈ కుపన్లు సిద్ధం చేశారని తెలుస్తుంది మొదటగా ఓటర్ లిస్ట్ ప్రకారం ప్రతి ఇంటికి ఈ కుపన్లు పంపిణీ చేసి అనంతరం ఆ కూపన్లను , హవాలా రూపంలో మరొక ప్రాంతానికి లేదా వాళ్ళు సూచించిన ప్రాంతానికి వెళ్లి నగదు, సదరు వస్తువులను తీసుకునేలా పథకం రచించారు. ఇదిలా ఉండగా సిద్ధం సభలకు కూడా ఇదే విధంగా టోకెన్లు ఇచ్చి డబ్బులు పంచుతున్నారని సమాచారంతో గత మూడు రోజులుగా ఎంవివి సత్యనారాయణ , సిద్ధం సభలపై నిఘా పెట్టిన ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు శుక్రవారం రాత్రి దాడులు ప్రారంభించాయి.
ఈ దాడులు నిర్వహించే సమయంలో ఆఫీస్ సిబ్బందితోపాటు ఎంవివి సత్యనారాయణ ఆయన సన్నిహితులు జీ.వెంకటేశ్వరరావు(జీవి) కూడా ఆఫీసులోనే ఉన్నారు ఆయనతో పాటు ఆఫీస్ సిబ్బందిలో కొంతమందిని 12 గంటల వరకు, మరి కొంతమందిని ఒంటి గంటన్నర వరకు విచారించారు. ఈ దాడిలో విశాఖపట్నం ఈస్ట్ ఫ్లయింగ్ స్క్వాడ్, విశాఖపట్నం ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఎఫ్ ఎస్ టి టీం – 4 లతోపాటు మరో రెండు బృందాలకు చెందిన సుమారు 25 నుండి 30 మంది అధికారులు పాల్గొన్నారు. సోదాల అనంతరం అధికారులు బయటకు వెళ్ళిపోగా , ఆ చీరలను, కుపన్లను ఇతర సామాగ్రి ,నగదు,ను సీజ్ చేసి ఎంవిపి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మరిన్ని తాజావార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సమ్మెకు సిద్ధమైన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు..తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు మరోసారి సమ్మె బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం గడువు ముగుస్తుండటంతో మరో 48 గంటల్లో సమ్మెకు వెళ్లేందుకు అన్ని డిపోల ఆర్టీసీ జేఏసీ నేతలు సన్నద్ధమయ్యారు. అయితే, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి…
- ‘ఓం శాంతి డిస్కో శాంతి’ ఆల్ రెడీ కాషన్ కియా.. ఆల్ రెడీ’. టైటిల్, మోషన్ పోస్టర్ విడుదల…ఆనందో బ్రహ్మ, సేవ్ ది టైగర్స్ వంటి ఎంటర్టైనర్స్ సృష్టికర్త మహి వి.రాఘవ్ నుంచి రాబోతున్న మరో సరికొత్త కామెడీ హారర్ చిత్రం ‘ఓం శాంతి డిస్కో శాంతి’. ‘ఆల్ రెడీ కాషన్ కియా.. ఆల్ రెడీ’ క్యాప్షన్. మరోసారి ప్రేక్షకులను…
- తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే ప్రఖ్యాత “రేలంగి అవార్డు” గెలుచుకున్న నటుడు బాబు మోహన్ గారు ..తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి 41 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నటుడు, మాజీ మంత్రి, విశ్వ నట సామ్రాట్ డాక్టర్ బాబు మోహన్ గారికి తెలుగు ఫిలిం టెలివిజన్ వెల్ఫేర్ ఫార్మ్ & భారత్ కల్చరల్ అకాడమీ వారిచే…




Total views : 46148