జనజీవన స్రవంతిలో కలిసి గౌరవప్రదమైన జీవితం కొనసాగించాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు…

Advertisements

<p>అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు హింసా మార్గాన్ని విడనాడి&comma; జనజీవన స్రవంతిలో కలిసి గౌరవప్రదమైన జీవితం కొనసాగించాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పిలుపునిచ్చారు&period; కేంద్ర ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్ మార్చి 31తో ముగియనున్న నేపథ్యంలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ&period;&period; మావోయిస్టు అగ్రనేత గణపతి అలియాస్ ముప్పాళ్ల లక్ష్మణ్ రావు ఆరోగ్యం క్షీణించిందని తమకు సమాచారం ఉందని వెల్లడించారు&period; &OpenCurlyQuote;గణపతి గారు వెంటనే లొంగిపోవాలి&period; ఆయన లొంగిపోతే ప్రభుత్వ ఖర్చులతోనే పూర్తిస్థాయిలో మెరుగైన వైద్యం అందిస్తాం’అని భరోసానిచ్చారు&period; గణపతితో పాటు అజ్ఞాతంలో ఉన్న మరో ఏడుగురు ముఖ్య నేతలు కూడా వెంటనే లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు&period;<&sol;p>&NewLine;<p>గత రెండేళ్ల కాలంలో సుమారు 721 మంది మావోయిస్టులు లొంగిపోయారని డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు&period; సరెండర్ అయిన ప్రతి ఒక్కరికీ హోదాలతో సంబంధం లేకుండా ప్రభుత్వం తరపున అన్ని రకాల ప్రయోజనాలతో పాటు మెరుగైన పునరావాసం కల్పించామని ఆయన గుర్తు చేశారు&period; ఆయుధాలు వీడి వస్తే&comma; సమాజంలో తలెత్తుకుని జీవించేలా ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు&period; కాగా&comma; మావోయిస్టులకు కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు నేటితో ముగియనుంది&period; ఈ నేపథ్యంలో అజ్ఞాతంలో ఉన్న వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని లొంగిపోవాలని డీజీపీ శివధర్ రెడ్డి మరోసారి మీడియా ద్వారా స్టేట్‌మెంట్ ఇచ్చారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.