త్వరలో తెరుచుకోనున్న పలాస వెంకటేశ్వర స్వామి ఆలయం…

Advertisements

<p>ఒక చిన్న దుర్ఘటన&period;&period; అప్పటి వరకు ఉన్న ఘన చరిత్రను కాలరాస్తుంది&period; ఒక్క లోపం&period;&period; అప్పటి వరకు ఉన్న మంచి పేరును చెరిపేస్తుంది&period; శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన ఆధ్యాత్మిక వేత్త హరిముకుంద పాండా విషయంలో అదే జరిగింది&period; ఏళ్ల తరబడి కష్టపడి ఆయన నిర్మించుకున్న ఆధ్యాత్మిక సామ్రాజ్యం&&num;8230&semi; ఒక విషాద ఘటనతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది&period; శ్రీకాకుళం జిల్లాలోని పలాస అంటే కేవలం జీడి పరిశ్రమకు మాత్రమే కాదు&comma; దానధర్మాలకు&comma; అచంచలమైన దైవభక్తికి కూడా పెట్టింది పేరు&period; ఆ గడ్డపైనే పేదల పెన్నిధిగా&comma; ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తగా వెలుగొందారు హరిముకుంద పండా&period; ఆయన జీవితం ఒక సేవా యజ్ఞం లాంటిది&period; కానీ వైకుంఠ ఏకాదశి నాడు జరిగిన దుర్ఘటనతో ఆయన ప్రతిష్ట పూర్తిగా మసకబారిపోయింది&period;<&sol;p>&NewLine;<p>కాశీబుగ్గకు చెందిన &ZeroWidthSpace;హరిముకుంద పండా&period;&period; స్వతహాగా భూస్వామి&period; అయితే డబ్బు ఉందన్న అహం ఆయనలో ఎన్నడూ లేదు&period; ఎంత ధనవంతుడో అంతకంటే పెద్ద మనసున్న మనిషి&period; సామాన్యుడి ఆకలి విలువ తెలిసిన వ్యక్తి కావడంతో&comma; తన వద్దకు వచ్చే ప్రతి పేదవాడికి ఆశ్రయం కల్పించేవారు&period; తన నివాసానికి వచ్చిన ఎవరినీ ఖాళీ కడుపుతో పంపకూడదనేది ఆయన సిద్ధాంతం&period; ప్రతినెలా పేద ప్రజలకు మనిషికి 200 నుండి 400 రూపాయల వరకు పెన్షన్ అందిస్తూ&comma; వారికి కడుపునిండా భోజనం పెట్టి పంపేవారు&period; ఆ కాలంలో ఇది సామాన్యమైన విషయం కాదు&period; వేలాది కుటుంబాలకు ఆయన ఒక అదృశ్య హస్తంలా అండగా నిలిచారు&period;<&sol;p>&NewLine;<p>దైవభక్తి మెండుగా ఉన్న పండా&&num;8230&semi; ఆధ్యాత్మికతను సామాన్యులకు చేరువ చేయాలని సంకల్పించారు&period; తనకున్న 12 ఎకరాల సువిశాల భూమిలో అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారు&period; ఆ ఆలయం కేవలం ఒక కట్టడం కాదు&comma; వేలాది మంది భక్తుల నమ్మకానికి వేదిక&period; ఈ క్షేత్రం పలాస పరిసర ప్రాంతాల్లో ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లింది&period; అందరూ దీన్ని చిన్న తిరుపతి అని పిలుచుకునేవారు&period;<&sol;p>&NewLine;<p>అంత వైభవంగా వెలుగొందిన ఆ ఆలయ చరిత్రలో గత ముక్కోటి ఏకాదశి చీకటి రోజుగా మిగిలిపోయింది&period; పర్వదినాన స్వామివారి దర్శనం కోసం పోటెత్తిన భక్తుల మధ్య జరిగిన తొక్కిసలాటలో 12 మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత విషాదం నింపింది&period; ఆ పవిత్ర స్థలంలో జరిగిన ఈ అవాంఛనీయ ఘటనతో హరిముకుంద పండాతో పాటు భక్తులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు&period; ఆ దుర్ఘటన తర్వాత ఆలయం చాలా కాలంగా మూతపడి ఉంది&period; అయితే ఈ మధ్య కాలంలో ఆలయంలో దొంగలు పడి&&num;8230&semi; దేవతా విగ్రహాల మీద ఉన్న బంగారమంతా ఎత్తుకెళ్లారు&period; అయితే దీనిపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి&period; సీజ్‌ చేసిన ఆలయంలో నుంచి నగలు మాయమైతే బాధ్యత వహించాల్సింది ఎవరు అని ప్రశ్నిస్తున్నారు&period; మరోవైపు హరిముకుంద పండా మాత్రం త్వరలోనే ఆలయం మళ్లీ తెరుచుకుంటుందని&&num;8230&semi; నగలు మళ్లీ తయారు చేయిస్తున్నామని చెప్పారు&&num;8230&semi;<&sol;p>&NewLine;<p>హరిముకుంద పండా చేసిన సేవలు పలాస చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేవి&period; ఒక వ్యక్తి తన సొంత భూమిని దైవ కార్యానికి&comma; తన సంపాదనను పేదవారి ఆకలి తీర్చడానికి వెచ్చించడం సామాన్యమైన విషయం కాదు&period; జరిగిన విషాదం బాధాకరమైనదే అయినా&comma; పండా సేవా కార్యక్రమాలు&comma; ఆయన నిర్మించిన ఆ పుణ్యక్షేత్రం మళ్ళీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని పలాస వాసులు కోరుకుంటున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ వచ్చేనెలలో భారత్‌కి వచ్చే ఛాన్స్‌.

పశ్చిమగోదావరి జిల్లా సముద్రంలో బోటు బోల్తా.

22ఏపై బీజేపీ దీక్షలు.