116
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలం పెన్నా పరివాహక ప్రాంతమైన జమ్మిపాలెంలో అనాధికార అక్రమ ఇసుక తవ్వకాలు మరియు రవాణా జరుగుతుందన్న సమాచారంతో కోవూరు ట్రైనింగ్ డీఎస్పీ మరియు స్థానిక పోలీసుల సహకారంతో.. అక్రమంగా ఇసుక తవ్వుతున్న హిటాచీని, అక్రమ ఇసుక తీసుకెళ్తున్న మూడు ట్రాక్టర్లు, మూడు టిప్పర్లను స్వాధీనం చేసుకుని కోవూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అక్రమంగా ఎక్కడైనా ఇసుక తవ్వకాలు జరిపితే ఉక్కుపాదం మోపుతామని స్థానిక ట్రైనింగ్ డీఎస్పీ తెలిపారు.