Wednesday, September 30, 2026
News Navigation
Wednesday, September 30, 2026
News Navigation

Breaking

Wednesday, September 30, 2026
Home Latest News మరో నాలుగు రోజుల్లో ముగియనున్న రాయితీ..

మరో నాలుగు రోజుల్లో ముగియనున్న రాయితీ..

by Rama
Traffic chalana

తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలానా చెల్లింపునకు రాయితీ గడువు మరో నాలుగు రోజులు మాత్రమే ఉంది. ఈ నెల 10వ తేదీ వరకు రాయితీతో పెండింగ్ చలాన్లను చెల్లించవచ్చు. రాయితీ నేపథ్యంలో వాహనదారుల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. డిసెంబరు 26 నుంచి ఇప్పటి వరకు 76.79 లక్షల చలాన్లకు సంబంధించి రూ.66.77 కోట్ల చెల్లింపులు జరిగాయి. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80 శాతం, ఫోర్ వీలర్లకు 60 శాతం, ఆర్టీసీ బస్సులు, తోపుడు బండ్లపై 90 శాతం, భారీ వాహనాలపై 50 శాతం రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రంలో 2 కోట్లకు పైగా చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో ఉన్నతాధికారులు రాయితీని ప్రకటిస్తూ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది రాయితీ ప్రకటనతో 45 రోజుల్లోనే ఏకంగా రూ.300 కోట్ల ఆదాయం సమకూరింది. మీ సేవ, పేటీఎం, టీ వ్యాలెట్‌, నెట్ బ్యాకింగ్ ద్వారా చెల్లింపులు జరపవచ్చు. అయితే, ఫేక్ చలానా వెబ్ సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Advertisements

You may also like

Copyright © 2026 CVR Telugu. All Rights Reserved.

error: