90
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ సోదాలు కలకలం రేపాయి. కవిత నివాసంలో ఐటీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన 10 మంది అధికారుల బృందం ఈ ఐటీ దాడుల్లో పాల్గొన్నట్లు తెలిసింది. ఈడీ అధికారులతో కలిసి ఐటీ ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం. నాలుగు టీమ్లుగా ఏర్పడి అధికారులు తనిఖీలు చేపట్టారు. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపై కూడా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ దాడుల నేపథ్యంలో కవిత నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. మరో వైపు లిక్కర్ కేసులో ఈడీ సమన్లు రద్దు చేయాలన్న కవిత పిటిషన్ విచారణను ఈ నెల 19కి సుప్రీం కోర్టు వాయిదా వేసింది.