సింగరేణి పరిరక్షణతో పాటు కార్మికుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత ప్రభుత్వాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను తిరిగి ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కె దక్కుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా గోదావరిఖని ఓసిపి 5 బొగ్గుగని పై బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి సీఎం కేసీఆర్ ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రి గా గెలిపించాలని కార్మికులను కోరారు. తన వంతుగా కార్మికుల హక్కుల సాధన కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్మికులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట నగర మేయర్ అనిల్ కుమార్ , తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు వెంకట్రావు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
గోదావరిఖని ఓసిపి 5 బొగ్గుగనిలో ఎన్నికల ప్రచారం..
71