సింగరేణి ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా కలిగిన సింగరేణి ఉద్యోగులకు ఇకపై రూ.1 కోటి వరకు ప్రమాద బీమా లభించనుంది. ఆ మేరకు బ్యాంకు అంగీకరించింది. ఈ కొత్త బీమా పథకాన్ని ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. సింగరేణి సీఎండీ బలరాం ఆదేశాలతో సంస్థ అధికారులు బ్యాంకు వర్గాలతో చర్చించారు. ఇప్పటివరకు సింగరేణి ఉద్యోగులకు ప్రమాద బీమా రూ.40 లక్షలుగా ఉంది. తాజా చర్చల అనంతరం ఇప్పుడది కోటి రూపాయలకు పెరిగింది.
Singareni Employees
రామగుండం ఏరియా సింగరేణి బొగ్గుగనుల పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ విజయం సాదించిన సందర్బంగా కాంగ్రెస్ అనుబంధ ఐ ఎన్ టి యు సి కార్యకర్తలు బొగ్గు గనులపై సంబరాలు చేసుకున్నారు.
రామగుండం రీజియన్ జిడికే 2వ బొగ్గుగని పై టపాసులు పేల్చి, స్వీట్లు పంపిణీ చేసారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ పెంచాల. తిరుపతి మాట్లాడుతూ గత పాలకులు సింగరేణి నిధులను ఇతర ప్రాంతాలకు తరలించి రామగుండం ప్రాంతాన్ని బొందల గడ్డగా చేసారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో కార్మికుల హక్కుల పరిరక్షణ తో పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. రామగుండం ఎమ్మెల్యేగా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గెలుపుకు సహకరించిన కార్మికుల ఈసందర్బంగా ధన్యవాదాలు తెలిపారు.
రామగుండం నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు తో పాటు సింగరేణి కార్మికులకు న్యాయం జరగాలంటే బిఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యమని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తెలిపారు. అర్థంపర్థం లేని మాటలు మాట్లాడుతూ ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇస్తూ ప్రజలను అయోమయానికి గురి చేస్తూ పబ్బం కడుక్కునే కాంగ్రెస్.. బీజేపీ నేతలు మాయమాటలు చెబుతారని రామగుండం నియోజకవర్గ ప్రజలు నమ్మవద్దని చందర్ తెలిపారు.. ఇప్పటికే దాదాపు రామగుండం నియోజకవర్గ అభివృద్ధి కి సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేశారని ఎమ్మెల్యే చందర్ తెలిపారు. రామగుండం ప్రజలు ఇప్పటికే తనను అత్యధిక మెజారిటీ తో గెలిపించి సీఎం కేసీఆర్ ని ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రిగా చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారని అంటున్నా రామగుండం బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అన్నివర్గాల ప్రజల అభ్యున్నతికి పాటుపడుతు సింగరేణి కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి కార్మికులు అండగా నిలవాలని రామగుండం ఎమ్మెల్యే ,బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుకంటి చందర్ కోరారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఏరియా గోదావరిఖని 2ఏ బొగ్గుగని పై తెలంగాణ కార్మిక సంఘం నాయకులతో కలిసి ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టారు. గత ప్రభుత్వాలు సింగరేణిలో పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను రాష్టం ఏర్పడిన తరువాత కారుణ్య నియామకాల ద్వారా తిరిగి తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కె దక్కుతుందన్నారు. అలాగే కార్మికుల కు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ పై అసత్యం ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.
Read Also..
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం, మందమర్రి డివిజన్, కాసిపేట్ టు ఇంక్లిన్ బుగర్భ గని మైన్ పైన ఈ రోజు ఉదయం మొదటి షిఫ్ట్ గేట్ మీటింగ్ లో టిబిజికెఎస్ యూనియన్ అధ్యక్షులు బి. వెంకట్రావు, బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ పాల్గొన్నారు. బాల్క సుమన్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులందరూ కేసీఆర్ వెంట నడిచారు. తెలంగాణ ప్రభుత్వంలో సింగరేణి కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాము.
తెలంగాణ తొలి అసెంబ్లీ సమావేశాల్లో కార్మికులకు ఆదాయపు మినహాయించాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపినా కేంద్రం పెడచెవిన పెట్టింది.
సింగరేణి క్వార్టర్ కలిగిన కార్మికుడి జీతం పైన పెర్క్ టాక్స్ ను ( గ్యాస్, వాటర్, ఎలక్ట్రిసిటీ సౌకర్యాలపై వేసేది ) కోల్ ఇండియాలో అమలు చేస్తున్న విధంగా సింగరేణిలో కూడా యాజమాన్యమే కార్మికులకు చెల్లించేలా చేస్తామని మొన్న మందమర్రిలో జరిగిన సభలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
సింగరేణి క్వార్టర్లను కార్మికులకు, రిటైర్డ్ కార్మికులకు ఇస్తాం. 32% లాభాలను, స్పెషల్ ఇంక్రిమెంట్లను, సుమారు 17వేల డిపెండెంట్ ఉద్యోగాలు కెసిఆర్ ప్రభుత్వంలో ఇచ్చామని తెలిపారు. ఇన్నేళ్లుగా కనబడని వివేక్ ఎన్నికలు రాగానే ఓట్ల కోసం కార్మికులపై దొంగ ప్రేమ చూపిస్తున్నాడు.
కార్మికులు సంఘాల పేరు మీద ఆగం కావొద్దు, తొందరపడొద్దు. కోట్ల డబ్బులతో కార్మికులను మోసం చేయాలని వివేక్ కుటుంబం చూస్తుంది.
డివిజన్ పరిధిలోని KK6, శ్రావణపల్లి ఓసి లను వేలానికి పెట్టింది. ఈ రెండు మైన్స్ ని వేలానికి వేసి తన కంపెనీకి అప్పజెప్పాలని కుట్ర చేస్తున్నాడు.
కాంగ్రెస్ కు వేసే ఓటు సింగరేణి సంస్థను ముంచడానికే అన్నారు. కార్మికుల తరఫున గొంతునై నినదిస్తా, ఏజెంటుగా సేవ చేస్తా దయచేసి కార్మికులందరూ సంఘాలకు అతీతంగా నన్ను ఆశీర్వదించాలి అని బాల్క సుమన్ కొరారు.
సింగరేణి పరిరక్షణతో పాటు కార్మికుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, గత ప్రభుత్వాలు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను తిరిగి ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కె దక్కుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా గోదావరిఖని ఓసిపి 5 బొగ్గుగని పై బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి సీఎం కేసీఆర్ ను హ్యాట్రిక్ ముఖ్యమంత్రి గా గెలిపించాలని కార్మికులను కోరారు. తన వంతుగా కార్మికుల హక్కుల సాధన కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్మికులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట నగర మేయర్ అనిల్ కుమార్ , తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు వెంకట్రావు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
సింగరేణి కార్మికులకు శుభవార్త. సింగరేణి కార్మికులకు రూ.1.53 లక్షల దసరా బోనస్ ప్రభుత్వం ప్రకటించింది. దసరా బోనస్ కింద రూ.711 కోట్లు విడుదల చేసింది. దీంతో ఓక్కో కార్మికుడికి రూ.1.53 లక్షల మొత్తాన్ని బోనస్‌గా ఇవ్వనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. సంస్థలో పని చేస్తున్న 42 వేల మంది కార్మికులకు దీనిని వర్తింపజేస్తున్నట్లు వెల్లడించింది. ఒకట్రెండు రోజుల్లో పండగ అడ్వాన్స్‌ను కూడా చెల్లించనున్నట్లు సింగరేణి అధికారులు తెలిపారు.