ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా(West Godavari District)లో ఎన్నికల ప్రచారం(Election Campaign) ఊపందుకుంది. ఉమ్మడిగా తణుకు, నిడదవోలులలో జరిగే బహిరంగ సభ(Public Meeting)లకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు(Chandrababu), జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హాజరుకానున్నారు. ఎన్నికల షెడ్యూల్(Election Schedule) ప్రకటించిన తరువాత ఉమ్మడి జిల్లాలో ఇద్దరు నేతలు సంయుక్తంగా హాజరు కానున్నారు. కాసేపట్లో తణుకు నరేంద్ర సెంటర్లోనూ, నిడదవోలులో రాత్రి ఏడు గంటలకు బహిరంగ సభలు నిర్వహించన్నారు. ఇద్దరు నేతలు నేరుగా తణుకుకు రెండు హెలికాఫ్టర్లలో చేరుకోనున్నారు.
ఇది చదవండి: రసవత్తరంగా మారిన నరసాపురం రాజకీయం…
కాగా సభ అనంతరం చంద్రబాబు, పవన్ ఇద్దరు నేతలు రోడ్డు మార్గాన నిడదవోలు చేరుకోనున్నారు. సభ తరువాత చంద్రబాబు నాయుడు నిడదవోలులోనే రాత్రి బస చేస్తారు. కాగా నిడదవోలులో జరిగే సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి యంపీ అభ్యర్థి పురందేశ్వరి కూడా పాల్గొనే అవకాశం ఉంది. తణుకులో జరిగే ప్రజాగళం సభకు జిల్లా నలుమూలల నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యేలా కూటమి నేతలు ఏర్పాట్లు చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి