మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం లోని హస్తాల్పూర్., బండమీదిపల్లి, ముల్లూరు గ్రామం, పెద్దాపూర్ గ్రామం లో బిఆర్ఎస్ అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి వివిధ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. అధికారంలోకి వస్తే పేదలకు మరిన్ని సంక్షేమ పథకాలను తీసుకురావడం జరుగుతుందని మెదక్ జిల్లా నర్సాపూర్ బి ఆర్ ఎస్ అభ్యర్థి సునీత రెడ్డి అన్నారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండలం లో పలు గ్రామాల్లో ప్రచారం చేశారు. అధికారంలోకి రాగానే రేషన్ దుకాణాలలో సన్న బియ్యం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గ్రామాలకు బాగు లేని రోడ్లకు కొత్త రోడ్లు వేయడం జరుగుతుందన్నారు. మహిళలందరికీ మహిళా సమాఖ్య భవనాలు కట్టడం జరుగుతుందన్నారు. సౌభాగ్య లక్ష్మి పేరుతో ప్రత్యేకంగా నెలకు 3000 ఇవ్వడం జరుగుతుందన్నారు ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల వరకు ఇవ్వడం జరుగుతుందన్నారు. గ్యాస్ సిలిండరు 400 కు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుండి 15 లక్షల వరకు పెంచడం జరిగిందన్నారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను అధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. అధికారమిస్తే దాంతో అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. టిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే మదన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
మెదక్ జిల్లాలో సునీత లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం..
69
previous post