ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఎన్నికల ప్రచారంలో నిరసన సెగ తగిలింది. ప్రచారంలో భాగంగా సత్తుపల్లి మండలం యాతాల కుంట గ్రామంలో ప్రచారం చేస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. యాతాల కుంట గ్రామంలో సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి రావాల్సిన నష్టపరిహారం, డబల్ బెడ్ రూమ్ ఇల్లు, సీలింగ్ భూములపై, గిరి వికాస్ బోరు బావుల విషయంపై మాజీ ఎమ్మెల్యే సండ్ర పై గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతుందంటూ.. ప్రజలకు మీరేం చేశారంటూ సండ్రాను నిలదీశారు. సండ్ర గిరిజనులకు సర్దిచెప్పి ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ప్రచారం మధ్యలోనే వెన్న తిరిగారు. సండ్రను గిరిజనులు అడ్డుకున్న సందర్భంలో… స్థానికులు తమ సెల్ ఫోన్లలో వీడియోలు తీస్తుండటంతో సండ్ర అనుచరులు స్థానికులపై దుర్భాషలాడుతూ భౌతిక దాడులకు దిగారు. దీంతో గ్రామస్తులు సండ్రాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఎన్నికల ప్రచారంలో నిరసన సెగ…
82
previous post