73
ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఓటరు తీర్పు మరికొద్ది గంటల్లో వెలువడనున్నది. పటిష్ట బందోబస్తు నడుమ ఓట్ల లెక్కింపునకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 5 గంటలకే అధికారులు లెక్కింపు కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభంకానున్నది. నగరంలో తొలి ఫలితం చార్మినార్ నియోజకవర్గం నుంచి వచ్చే అవకాశం ఉండగా, చివరి ఫలితం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో వెల్లడికావచ్చు. హైదరాబాద్ జిల్లాలో అత్యధికంగా 14 లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేయగా, యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. మిగిలిన 13 నియోజకవర్గాలకు విడిగా కేంద్రాలు ఏర్పాటు చేశారు.