వెనకపడ్డ శ్రీ సత్యసాయి జిల్లా(Sri Sathya Sai District)లో ఎన్నికలు వేడెక్కాయి. ఎన్నికల నోటిఫికేషన్(Election Notification) విడుదలైన తొలిరోజే పలు ప్రాంతాల్లో జోరుగా నామినేషన్లు దాఖలయ్యాయి. పుట్టపర్తిలో టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర నామినేషన్ వేశారు. అంతకు ముందు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. సత్యమ్మ దేవాలయంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి(Raghunath Reddy)తో కలిసి పల్లె సింధూర ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇది చదవండి: నామినేషన్ దాఖలు చేయనున్న పల్లె సింధూర రెడ్డి..
అక్కడి నుంచి నేరుగా ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి రిటర్నింగ్ అధికారి భాగ్యరేఖకు నామినేషన్ పత్రాలు అందజేశారు. పెద్ద ఉత్సవంలా ఈ కార్యక్రమం నిర్వహించారు. తమ బలాన్ని చాటుకునేందుకు టీడీపీ నేత, మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి దీన్ని ఉపయోగించుకున్నారు. నియోజకవర్గం నలుమూలల నుంచి తెలుగు తమ్ముళ్లు తరలి రావడంతో పుట్టపర్తి పసుపు మయమైంది.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
- కరెంటు బిల్లు కట్టలేదని ప్రభుత్వ ఆసుపత్రి మూసివేత
- ఏపీలో 53 బార్లకు రీనోటిఫికేషన్
- 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తాం
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి