ఎన్నికల నోటిఫికేషన్ (Election Notification) :
నాలుగోదశ ఎన్నికల నోటిఫికేషన్ (Election Notification)ను ఎన్నికల సంఘం విడుదల చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. పదకొండు గంటల నుంచి ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. పార్లమెంట్ స్థానాలకు కలెక్టరేట్లల్లో, అసెంబ్లీ స్థానాలకు నియోజకవర్గ ప్రధాన కేంద్రాల్లో నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు స్వీకరించారు. నామినేషన్ వేసే అభ్యర్థితో పాటు మరో నలుగురికి మాత్రమే ఆర్వో కార్యాలయం లోపలికి అనుమతి ఇచ్చారు. నామినేషన్ వేసే అభ్యర్థుల ఊరేగింపుతో పాటు దాఖలు చేసే ప్రాంతంలో పూర్తిగా వీడియో రికార్డింగ్ చేశారు.
Follow us on : Facebook, Instagram, YouTube & Google News
అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో హెల్ప్ డెస్కుల ఏర్పాటు చేశారు. నాలుగో దశలో ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే 10 రాష్ట్రాల్లోనూ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 పార్లమెంటు నియోజకవర్గాలకు మే 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అదే తేదీన తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది. ఇదిలా ఉండగా ఈ నెల 25న సీఎం జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Follow us on : Google News మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భోజ్శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పుమధ్యప్రదేశ్లో భోజ్ శాల ఆలయ కేసులో కీలక తీర్పు వెలువడింది. వివాదాస్పద స్థలం ఆలయానికే చెందుతుందని ఆ రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. అక్కడ సరస్వతిదేవి విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చని కేంద్రానికి హైకోర్టు సూచన చేసింది. ఆలయ ప్రాంతాన్ని పురావస్తుశాఖ అధీనంలోకి…
- జూన్ 21న నీట్ రీ ఎగ్జామ్ నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటన..దేశవ్యాప్తంగా వివాదాలకు కేంద్రబిందువైన నీట్ యూజీ 2026 పరీక్షపై కీలక అప్డేట్ వెలువడింది. ప్రశ్నపత్రం లీకేజీ, అవకతవకల ఆరోపణలతో రద్దైన ఈ పరీక్షను తిరిగి నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొత్త తేదీని ప్రకటించింది. జూన్ 21, ఆదివారం దేశవ్యాప్తంగా రీ-ఎగ్జామ్…
- యూపీలో గాలివాన బీభత్సం..యూపీలో గాలివాన సృష్టించిన బీభత్సంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. పలు ప్రాంతాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో 117 మంది మృతి చెందగా, 72 మంది గాయపడ్డారు. యూపీలో కురిసిన అకాల వర్షాలు పెను విషాదాన్ని నింపాయి. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి,…
CVR న్యూస్ తెలుగు వాట్సాప్ ఛానల్ ను ఫాలో అవ్వండి: నాలుగోదశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల…





Total views : 78250