రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను షెడ్యూల్ ప్రకారమే డిశంబర్ 27 న నిర్వహించాలని సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్టియుసి) కేంద్ర కమిటీ సీనియర్ ఉపాధ్యక్షుడు సిద్దంశెట్టి రాజమౌళి, ప్రధాన కార్యదర్శి కాంపెల్లి సమ్మయ్యలు కోరారు. మంగళవారం పట్టణంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో పని చేసిన కొంతమంది అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించేలా, ఐఎన్టియుసిని అబాసు పాలు చేసేలా, ఎన్నికలు వాయిదా వేయాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఐఎన్టీయూసీ కి మద్దతు ఇవ్వడం లేదనే చేస్తున్న ప్రచారం అసత్యమని, దానిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ కేంద్ర కమిటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి, ఐఎన్టీయూసి జిల్లా అధ్యక్షుడు రాంశెట్టి నరేందర్, ఏరియా ఉపాధ్యక్షుడు దేవి భూమయ్య, నాయకులు మిట్ట సూర్యనారాయణ పాల్గొన్నారు.
షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలి – ఐఎన్టియుసి
67
previous post